TGLA 711 రంగారెడ్డి జిల్లా అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ

Tgla 711

BIKKI NEWS (FEB. 20) : TGLA 711 RANGAREDDY CALENDAR. TGLA-711 రంగారెడ్డి జిల్లా అసోసియేషన్ క్యాలెండర్ ని ఆవిష్కరించిన జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శ్రీ వెంక్యా నాయక్.

TGLA 711 RANGAREDDY CALENDAR

ఈ సందర్భంగా వెంక్యా నాయక్ మాట్లాడుతూ…. రేపు జరగబోయే పబ్లిక్ పరీక్షల్లో అందరూ సమర్థవంతంగా తమ విధులు నిర్వహించాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలల యందు అడ్మిషన్లు భారీగా పెంచే విధంగా, అదే విధంగా మంచి ఫలితాలను సాధించే విధంగా మీరందరూ కృషి చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు మారం హేమచందర్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో బిజీ షెడ్యూల్ లో ఉన్నప్పటికీ కోరికను మన్నించి తమ సంఘం యొక్క క్యాలెండర్ ను ఆవిష్కరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా క్యాలెండర్ ఆవిష్కరింప చేయాలని దిశా నిర్దేశం చేసిన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనక చంద్రంకు, అదేవిధంగాఈ కార్యక్రమంలో పాల్గొని మాకు శుభాకాంక్షలు తెలియజేసిన జీజేఎల్ఏ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు జీ. సైదులు, రాష్ట్ర కార్యదర్శి ఏ‌ నరేందర్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యమ్. పర్వతాలు గౌడ్ మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర పెద్దలకు ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అత్తి రామారావు సంఘ నాయకులు రవి, రామిరెడ్డి , విష్ణు , రాధా, ప్రవీణా, నాగయ్య, పాండు, నర్సయ్య, శ్రీనివాస్, సైదులు, యట్టయ్య నారాయణ తదితరులు పాల్గొనడం జరిగింది.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →