Guest faculty jobs – నల్గొండ బీసీ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ జాబ్స్

Nalgonda district guest faculty jobs

BIKKI NEWS (July 11) : Nalgonda BC Gurukula guest faculty jobs notification. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మరియు జూనియర్ కళాశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో అతిథి అధ్యాపకుల (Guest Faculty) నియామకానికి అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రాంతీయ సమన్వయ అధికారి శ్రీమతి ఈ. స్వప్న గారు ఒక ప్రకటనలో తెలిపారు.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Nalgonda BC Gurukula guest faculty jobs notification.

​మహిళా (WOMEN) అభ్యర్థులు మాత్రమే క్రింది పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి

​జూనియర్ లెక్చరర్ – ఇంగ్లీష్
​జూనియర్ లెక్చరర్ – ఎకనామిక్స్
​పీజీటీ – ఇంగ్లీష్
​పీజీటీ – సోషల్ స్టడీస్
​అలాగే జనరల్ కోటా కింద

పురుషులు మరియు మహిళలు క్రింది సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు:

​పీజీటీ – హిందీ
​పీజీటీ – మ్యాథమెటిక్స్
​పీజీటీ – ఫిజికల్ సైన్స్
​జూనియర్ లెక్చరర్ – ఫిజిక్స్
​జూనియర్ లెక్చరర్ – కెమిస్ట్రీ
​జూనియర్ లెక్చరర్ – బోటనీ

​అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (P.G.) మరియు బి.ఎడ్. (B.Ed.) పూర్తి చేసి, కనీసం P.G లో 55% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

​అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తులను 11-07-2026 నుండి 14-07-2026 వరకు పని దినాలలో ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు, ఎం.జె.పి.టి.బి.సి. సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల(కనగల్), ఏడూరి గార్డెన్స్ ఫంక్షన్ హాల్ సమీపంలో, మిర్యాలగూడ రోడ్, నల్గొండలో సమర్పించవచ్చు.

​16-07-2026 (గురువారం) నాడు అర్హులైన అభ్యర్థులకు ఎం.జె.పి.టి.బీ.సి. సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల (అప్పాజీపేట), రాఘవేంద్ర బి.ఎడ్. కళాశాల లో, మునుగోడు రోడ్, నల్గొండలో ఉదయం 9.00 గంటలకు సబ్జెక్టుల వారీగా డెమో ప్రక్రియ నిర్వహించబడతాయి.

​మరిన్ని వివరాల కోసం 08682224566 , 7993456805 నంబర్లను సంప్రదించవచ్చని జిల్లా ప్రాంతీయ సమన్వయ అధికారి శ్రీమతి ఈ. స్వప్న గారు తెలిపారు.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →