Special educator jobs in khammam district – ఖమ్మం జిల్లా పాఠశాలల్లో స్పెషల్ ఎడ్యుకేటర్ జాబ్స్

Special educator jobs in khammam district pm shri schools

BIKKI NEWS (OCT. 05) : ఖమ్మం జిల్లాలోని 26 పీఎంశ్రీ ఉన్నత పాఠశాలల్లో గెస్ట్ స్పెషల్ నీడ్స్ ఎడ్యుకేటర్లను తాత్కాలిక ప్రాతిపదికన నియమించనున్నట్లు డీఈఓ డి.వాసంతి ఒక ప్రకటనలో తెలిపారు.

Special educator jobs in khammam district PM shri schools

ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు పాఠశాల స్థాయిలో సమగ్ర విద్య అందించడంతో పాటు వారికి అవసరమైన ప్రత్యేక విద్యా సాయం, మార్గదర్శకత్వం, భవిత కేంద్రాల ద్వారా సేవలు అందించేందుకు ఈ నియామకాలు చేపడుతున్నామని తెలిపారు.

అర్హతలు :

బీఈడీలో స్పెషల్ ఎడ్యుకేషన్ ఉన్నవారు అర్హులని, ఎంపికైన ఎడ్యుకేటర్లు నవంబర్ నుంచి మార్చి 2027 వరకు ఐదు నెలల కాలానికి తాత్కాలిక ప్రాతిపదికన విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

వేతనం :

నెలకు రూ.16,500 గౌరవ వేతనం అందుతుంది

దరఖాస్తు విధానం, గడువు :

ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను సంబంధిత హెచ్ఎంలు లేదా ప్రిన్సిపాళ్లకు సెప్టెంబర్ 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. . కాగా,

రాష్ట్ర స్థాయిలో జారీ చేసిన మార్గదర్శకాలు, అర్హతలు, స్థానికత, మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుందని తెలిపారు..

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Also Read…

• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →