Mulugu district Anganwadi jobs – ములుగు జిల్లాలో 135 అంగన్వాడీ జాబ్స్

Mulugu district anganwadi recruitment notification 2026

BIKKI NEWS (July 02) : Mulugu district Anganwadi recruitment notification 2026. తెలంగాణ ప్రభుత్వ మహిళా, శిశు, వికలాంగుల మరియు వయో వృద్ధుల శాఖ, ములుగు జిల్లా పరిధిలోని తాడ్వాయి మరియు వెంకటాపురం ఐసీడీఎస్ (ICDS) ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ (AWT) మరియు అంగన్‌వాడీ హెల్పర్ (AWH) పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Mulugu district Anganwadi recruitment notification 2026

ఖాళీల వివరాలు : (135)

  • అంగన్వాడీ టీచర్ : 31
  • అంగన్వాడీ హెల్పర్ : 104

అర్హతలు మరియు నిబంధనలు (Eligibility Criteria)

​1. విద్యా అర్హత:
  • ​అంగన్‌వాడీ టీచర్: అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ (12వ తరగతి) ఉత్తీర్ణులై ఉండాలి.
  • ​అంగన్‌వాడీ హెల్పర్: గిరిజన ప్రాంతాలలో ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు అందుబాటులో లేని పక్షంలో, పదో తరగతి (SSC) ఉత్తీర్ణులైన వారిని కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
2. వయస్సు:
  • ​అభ్యర్థుల వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి (01.07.2026 నాటికి).
​3. స్థానికత (Local Resident):
  • ​అభ్యర్థి తప్పనిసరిగా సంబంధిత అంగన్‌వాడీ కేంద్ర పరిధి/వార్డ్ (పట్టణ ప్రాంతం అయితే) లేదా గ్రామపంచాయతీ (గ్రామీణ ప్రాంతం అయితే) నివాసి అయి ఉండాలి.
  • ​ఎస్టీ/ఎస్సీ సబ్ ప్లాన్ కింద కేటాయించిన పోస్టులకు ఆయా గ్రామం/ఆవాసం/హాబిటేషన్ కు చెందిన ఎస్టీ/ఎస్సీ మహిళలు మాత్రమే అర్హులు.

ఎంపిక విధానం మరియు మార్కుల వివరాలు (Selection Process)

అభ్యర్థుల ఎంపిక పూర్తిగా క్రింది ప్రమాణాల (మెరిట్ మరియు ఇంటర్వ్యూ) ఆధారంగా మొత్తం 100 మార్కులకు జరుగుతుంది: 

100 మార్కులతో 70 మార్కులు ఇంటర్మీడియట్ మార్కులకు వెయిటేజీ ఇవ్వబడుతుంది. 10 మార్కులు ఇంటర్వ్యూ కు, అనాధలకు 10, వితంతువులకు 5, దివ్యాంగులకు 5 మార్కుల చొప్పున వెయిటేజీ ఇవ్వబడుతుంది.

దరఖాస్తు చేసుకోవడం ఎలా? (How to Apply)

  • ​అర్హులైన మహిళా అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
  • ​సిడిపిఓ (CDPO), డిడబ్ల్యూఓ (DWO) లేదా ప్రజావాణిలో నేరుగా సమర్పించే ఎలాంటి ఆఫ్ లైన్ దరఖాస్తులు పరిగణనలోకి తీసుకోబడవు.
  • ​దరఖాస్తు కొరకు అధికారిక వెబ్‌సైట్: https://wdcw.tg.nic.in/ సందర్శించండి.
Mulugu district anganwadi recruitment notification 2026 vacancies
Mulugu district Anganwadi recruitment notification 2026
Mulugu district anganwadi recruitment notification 2026 vacancies
Mulugu district Anganwadi recruitment notification 2026
Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →