Model School Spot admissions – మోడల్ స్కూల్ స్పాట్ అడ్మిషన్లు

BIKKI NEWS (AUG. 27) : Model schools spot admissions 2025. తెలంగాణ రాష్ట్రంలోని మోడల్ స్కూల్స్ లో 2025-26 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న 48,630 సీట్లను పాఠశాల విద్యాశాఖ స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనుంది.

Model schools spot admissions 2025

6వ తరగతిలో 7,543, 7వ తరగతిలో 5,192, 8వ తరగతిలో 3,936, 9వ తరగతి లో 2,884, పదో తరగతి లో 3,151 సీట్లు ఖాళీగా కలవు.

అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో 13,256, ఫస్ట్ ఇయర్ లో 12,668 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ఈ సీట్ల కేటాయింపు కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించగా, మిగిలిన సీట్లను ఇప్పుడు స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనున్నారు.

స్పాట్ అడ్మిషన్ల కోసం దగ్గరలో ఉన్న మోడల్ స్కూల్ లను సంప్రదించండి.