BIKKI NEWS (JAN. 09) : MID DAY MEALS IN GOVERNMENT JUNIOR COLLEGES. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ మరియు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం.
MID DAY MEALS IN GOVERNMENT JUNIOR COLLEGES
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 330 కళాశాలలు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నాయని విద్యార్థులు దూరాభారాల నుండి కళాశాలలకు వస్తుంటారని, ఈ పథకం అమలు చేయడం ద్వారా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఇంటర్ బోర్డు డైరెక్టర్ శ్రీకృష్ణ కృష్ణ ఆదిత్య సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు.
దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి బడ్జెట్, అమలు విధానం ఒంటి అంశాలపై సమగ్ర నివేదిక అందించాలని కోరారని తెలిసింది.
అలాగే 9, 10 తరగతులు మరియు ఇంటర్మీడియట్ విద్య ఒకే ఆవరణలో ఉండాలని అంశం పైన కూడా అధ్యయనం చేయాలని సీఎం సూచించారు.
విద్యాశాఖ పై సీఎం రేవంత్ రెడ్డి జరిపిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.
- Rain Holiday today – ఈ జిల్లాలలో పాఠశాలలకు సెలవు
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
