JOB MELA – సెప్టెంబర్ 19న జాబ్ మేళా

BIKKI NEWS (SEP. 15) : Job mela in peddapalli district on September 19th. పెద్దపల్లి జిల్లా లో సెప్టెంబర్ 19న టాస్క్ కేంద్రం వద్ద జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఓ ప్రకటనలో తెలిపారు.

Job mela in peddapalli district on September 19th.

పెద్దపల్లి జిల్లాలోని నిరుద్యోగ యువకులకు టెలి పెర్ఫార్మెన్స్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ లో ఉద్యోగాలు కల్పించుటకు సెప్టెంబర్ 19న శుక్రవారం రోజున ఎంపీడీవో ఆవరణలోని టాస్క్ కేంద్రం వద్ద జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

టెలి పెర్ఫార్మెన్స్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ లో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ కాంటెంట్ మోడల్ అనలిస్ట్ పోస్ట్లు ఖాళీలు ఉన్నాయని, ఈ పోస్టులకు 2022 నుంచి 2025 వరకు సంవత్సరాలలో డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలని తెలిపారు.

ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ 19 రోజున సంబంధిత సర్టిఫికేట్స్ జిరాక్స్ లతో పాత ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో గల టాస్క్ సెంటర్ నందు నిర్వహించే జాబ్ మేళా లో హాజరు కావాలని సూచించారు.

మరిన్ని వివరాలకు : 9059506807 నందు సంప్రదించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రకటనలో తెలిపారు.