International day of human space flight - bikki news

International Day of Human Space Flight

హైదరాబాద్ (ఏప్రిల్ 12) :International Day of Human Space Flight April 12. అంతర్జాతీయ మానవ అంతరిక్ష యాత్ర దినోత్సవం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 12న నిర్వహించబడుతుంది. యూరీ గగారిన్ అంతరిక్షంలోకి వెళ్ళిన రోజుకు గుర్తుగా ఈ దినోత్సవం జరుపబడుతుంది.

International Day of Human Space Flight April 12

1961లో యూరి గగారిన్ వోస్టాక్ 1 అంతరిక్ష విమానంలో ప్రయాణించి, వోస్టోక్-కె ప్రయోగించిన వోస్టోక్ 3 కెఎ అంతరిక్ష నౌకలో 108 నిమిషాలపాటు భూమి చుట్టూ కక్ష్యలో పరిభ్రమించాడు. అంతరిక్షయానం 50వ వార్షికోత్సవానికి కొన్నిరోజులముందు 2011, ఏప్రిల్ 11న జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 65వ సెషన్‌లో ఈ దినోత్సవం ప్రకటించబడింది.

1963, ఏప్రిల్ 12నుండి సోవియట్ యూనియన్ లో కాస్మోనాటిక్స్ దినోత్సవంగా జరుపుకుంటారు. ఇప్పటికీ రష్యా, కొన్ని సోవియట్ పాత రాష్ట్రాల్లో కూడా దీనిని పాటిస్తారు.

2001లో గగారిన్ అంతరిక్షయానం 40వ వార్షికోత్సవం సందర్భంగా యునైటెడ్ స్టేట్స్ లో “వరల్డ్ స్పేస్ పార్టీ” అని కూడా పిలువబడే యూరిస్ నైట్ ప్రారంభించబడింది.

1981, ఏప్రిల్ 12 కొలంబియాకు చెందిన ఎస్టిఎస్-1 మొదటి అంతరిక్ష నౌక ప్రయోగం జరిగింది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →