Interest on retirement benefits must be paid – రిటైర్మెంట్ బెనిఫిట్ల వడ్డీ మూడు వారాల్లో చెల్లించాలి – హైకోర్టు ఆదేశం

Interest on retirement benefits must be paid

BIKKI NEWS (NOV. 14) : Interest on retirement benefits must be paid. పదవీ విరమణ ప్రయోజనాల (రిటైర్మెంట్ బెనిఫిట్స్) బకాయిలపై రావాల్సిన వడ్డీని మూడు వారాల్లోగా చెల్లించాలని హైకోర్టు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. ఈ గడువులోగా కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోతే వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Interest on retirement benefits must be paid

అసలేం జరిగిందంటే? కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన బేతికోనరెడ్డి అనే విశ్రాంత ఉద్యోగి తనకు రావాల్సిన రిటైర్మెంట్ బకాయిలను ప్రభుత్వం చెల్లించడం లేదంటూ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం, ఆరు నెలల్లోగా వడ్డీతో సహా బకాయిలన్నింటినీ చెల్లించాలని తీర్పునిచ్చింది.

కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు: హైకోర్టు విధించిన ఆరు నెలల గడువు ముగిసినప్పటికీ అధికారులు వడ్డీని చెల్లించలేదు. దీంతో బాధితుడు బేతికోనరెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ (Contempt Petition) దాఖలు చేశారు.

జస్టిస్ తంగిరాల మాధవీదేవి ఆగ్రహం: ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ తంగిరాల మాధవీదేవి, కేవలం అసలు మొత్తాన్ని మాత్రమే చెల్లించి వడ్డీని పెండింగ్‌లో ఉంచడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

  • వడ్డీ మొత్తాన్ని చెల్లించి, ఆ మేరకు కోర్టుకు నివేదిక సమర్పించేందుకు ప్రభుత్వానికి మరో మూడు వారాల గడువు ఇచ్చారు.
  • ఒకవేళ అప్పటికీ ఉత్తర్వులు అమలు చేయకపోయినా, నివేదిక దాఖలు చేయకపోయినా డిసెంబర్ 4న ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరుకావాలని జస్టిస్ మాధవీదేవి ఆదేశాలు జారీ చేశారు.
Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →