TGEJAC demanding 42% Fitment – పి.ఆర్.సి ని వెంటనే అమలు చేయాలని డిమాండ్

Tgejac demanding 42% fitment

BIKKI NEWS (Nov. 15) ; TGEJAC demanding 42% Fitment . తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తేది: 14-11-2026 (శనివారం) నాడు ఉ:10:00గం.లకు టి.జి.ఓ. భవన్, నాంపల్లి, హైదరాబాద్ నందు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఏలూరి శ్రీనివాస రావు అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ బి. శ్యామ్ సమావేశాన్ని ప్రారంభించగా ఈ సమావేశంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘ కార్యవర్గం, తెలంగాణ (33) జిల్లాలు, హైదరాబాద్ సిటీ మరియు సచివాలయం ముఖ్య కార్యవర్గ సభ్యులు (అధ్యక్షులు, కార్యదర్శులు, సహ అధ్యక్షులు & కోశాధికారులు) తో పాటు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (76) డిపార్ట్మెంట్స్ ఫోరమ్స్ ముఖ్య కార్యవర్గ సభ్యులు మరియు మహిళా విభాగం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

TGEJAC demanding 42% Fitment

ఈ రోజు తేది: 14-11-2026 (శనివారం) నాడు ఉ:10:00గం.లకు టి.జి.ఓ. భవన్, నాంపల్లి, హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో పలు విషయాలు చర్చించి తెలియజేసారు.

TGEJAC demanding 42% Fitment – నేటి తీర్మానాలు

పలు ముఖ్యమైన విషయాలపై విసృతమైన చర్చ అనంతరం ఈ క్రింది తీర్మానాలను సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది.
తీర్మానాలు

రెండవ వేతన సవరణ కమిషన్ (PRC) రిపోర్టును తెప్పించుకుని, 42% ఫిట్మెంట్ ను అమలు చేయాలని తీర్మానించనైనది.


ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి (5) రోజుల పని దినాలు అమలు చేయుటకు తీర్మానించనైనది.


ప్రస్తుతం ప్రతినెల చెల్లిస్తున్న 1000 కోట్లు పెండింగ్ బకాయిలను 2000 కోట్లకు పెంచి విడుదల చేయాలని తీర్మానించనైనది.


రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో వివిధ విభాగాల అధికారుల అధికారిక విధి నిర్వహణ కోసం వినియోగిస్తున్న ప్రైవేట్ అద్దె వాహనాల (హైరింగ్ వెహికిల్) నెలవారి చార్జీలను ప్రస్తుత మార్కెట్ ధరలకు అనుగుణంగా సవరించి కనీసం రూ. 60 వేలకు పెంచాలి.


రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని అన్ని విభాగాల డి.పి.సి లను ఏర్పాటు చేసి ప్రమోషన్ త్వరితగతిన ఇప్పించాలని తీర్మానించనైనది.


ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి సంవత్సరం సాధారణ బదిలీలు (మే మాసంలో) విధిగా తప్పనిసరిగా జరపాలని తీర్మానించనైనది.


ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని తీర్మానించనైనది.


జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో ఉన్న పర్మనెంట్ ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం గుర్తింపును వెంటనే పునరుద్దరించాలని తీర్మానించనైనది.


ఉద్యోగ సంఘాల ముఖ్య కార్యవర్గ సభ్యులకు (అధ్యక్షులు, కార్యదర్శులు, సహ అధ్యక్షులు & కోశాధికారులు) సాధారణ బదిలీలలో మినహాయింపు సౌకర్యము పునరుద్దరించాలని తీర్మానించనైనది.


జిల్లా ఉద్యోగ సంఘాల ముఖ్య కార్యవర్గ సభ్యులకు (21) రోజుల ప్రత్యేక సాధారణ సెలవులను వెంటనే పునరుద్దరించాలని తీర్మానించనైనది.


జిల్లా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘాలకు ఆఫీసు భవనాల నిర్మాణం కొరకు అన్ని జిల్లాలలో ప్రభుత్వం భూమిని కేటాయించాలని తీర్మానించనైనది.


జిల్లా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘాలకు హౌసింగ్ సొసైటిలకు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం అన్ని జిల్లాలలో భూమిని కేటాయించాలని తీర్మానించనైనది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు~

సెంట్రల్ అసోసియేషన్ మెంబర్స్

సెంట్రల్ అసోసియేషన్ మెంబెర్స్
అసోసియేట్ ప్రెసిడెంట్: ఎం. ఉపేందర్ రెడ్డి, కోశాధికారి: ఎస్, సహదేవ్, ఉపాధ్యక్షులు- ఏ.జగన్మోహన్ రావు, ప్రోఫ్.జి.మల్లేశం, డా.టి. హరికృష్ణ, డా.జి. దీపారెడ్డి, సెక్రేటరీస్ : డా. పి. శ్రీరామ్ రెడ్డి, శ్రీమతి. సి.హెచ్.శిరీష, ఆర్.శ్రీనివాస మూర్తి, ఆర్.కోటాజీ, కోలా రాజేష్ కుమార్, శ్రీమతి జె.సుజాత, ఆర్గనైసింగ్ సెక్రటరీస్: కె.కిరణ్ కుమార్, సురేష్ వంక దోత, పబ్లిసిటీ సెక్రటరీస్: అసనాల శ్రీనివాస్, ఆఫీసు సెక్రటరీస్: పి. యాదగిరి గౌడ్, క్రీడల మరియు ఆటల సెక్రేటరీస్ : బట్టు గోపి , ఇ సి మెంబర్స్ : డా . , ఏ నవీన్ జ్యోతి,

వివిధ జిల్లాల అధ్యక్షులు:
ఎస్.వెంకట పుల్లయ్య, ఎ.శ్రీనివాస్ కుమార్, ఏం.బి.కృష్ణ యాదవ్, జి.వెంకటేశ్వర్లు,
కందుకూరి రవిబాబు, సి.శ్రీనివాస్, శశిధర్ రెడ్డి, ఎం.కాళిచరణ్, వేలాద్రి, డా.కె.రామారావు, ఎస్.విజయ కుమార్, రవీంద్రబాబు , కె.వనజా రెడ్డి, కురుమూర్తి, జీవన్ కుమార్, పి.రాజశేకర్ రావు, బోడ యాదయ్య, మొగులప్ప, అలుక కిషన్, జబీ ఉల్లా, జయశ్రీ, నాగేందర్, సత్తార్, ఆనంద్,ఎస్.వరప్రసాద రావు, ఫణి కుమార్, శ్రీమతి చైతన్య
…. వివిధ జిల్లాల కార్యదర్శులు, సహాధ్యక్షులు, కోశాధికారులు, మరియు వివిధ ఫోరమ్స్ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →