Inter exams fee 2026 – ఇంటర్ విద్యార్థులందరికి ఫీజు కట్టే అవకాశం – బోర్డు

Inter exams fee 2026 for non affiliated college students

BIKKI NEWS : Inter exams fee 2026 for non affiliated college students. తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు లేని ఇంటర్మీడియట్ కళాశాలల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఊరట కల్పించేలా ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇలాంటి కళాశాలల్లో చేరిన విద్యార్థులు తమ విద్యా సంవత్సరం నష్టపోకుండా పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించనున్నట్లు బోర్డు స్పష్టతనిచ్చింది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Inter exams fee 2026 for non affiliated college students

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గుర్తింపు లేని కళాశాలల్లో ప్రవేశాలు పొందిన కారణంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు బోర్డు ఈ చర్య చేపట్టింది.

గుర్తింపు పొందని కళాశాలలకు తమ లోపాలను సరిదిద్దుకొని గుర్తింపు పొందేందుకు మరో అవకాశం ఇచ్చినట్లు సమాచారం

ఈ నిర్ణయం వల్ల గుర్తింపు లేని కళాశాలల్లో చేరిన విద్యార్థులకు విద్యా సంవత్సరం వృథా కాకుండా ఉండే అవకాశం లభించనుంది.

అక్టోబర్ 26 నుంచి పరీక్షల ఫీజు స్వీకరణ

వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి అక్టోబర్ 26 నుంచి నవంబర్ 9 వరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించనున్నట్లు బోర్డు ప్రకటించింది.

అవసరమైన విద్యార్థులు నిర్ణీత గడువులోగా ఫీజు చెల్లించాలి. ఆలస్య రుసుముతో డిసెంబర్ 14వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు కూడా అవకాశం కలదు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →