BC RESERVATIONS – బీసీ రిజర్వేషన్ల తీర్పులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు

BIKKI NEWS (OCT. 11) : . High Court’s key observations in the BC reservations verdict. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీచేసిన జీవో నెంబర్ 9 మరియు 42 లపై తాజాగా హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే . అలాగే ఎన్నికల నోటిఫికేషన్ పై కూడా స్టే విధించింది.

High Court’s key observations in the BC reservations verdict

ఈ సందర్భంగా ఇచ్చిన తీర్పులు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

వికాస్ కిషన్ రావు గవాలి కేసును పరిగణలోకి తీసుకొని స్టే విధిస్తున్నట్లు తీర్పులో స్పష్టం చేసింది.

గవాలి కేసులో సుప్రీంకోర్టు రిజర్వేషన్లు 50% మించొద్దని తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.

పాత రిజర్వేషన్ల పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఇవ్వరాదని ఈ సందర్భంగా తేల్చి చెప్పింది.

దామాషా సీట్లను ఓపెన్ కేటగిరి కింద నోటిఫై చేస్తూ ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అని తెలిపింది.

ఎన్నికల సంఘం సెప్టెంబర్ 29న జారీ చేసిన ఎన్నికల ప్రక్రియను నిలిపివేయలేదని ఈ సందర్భంగా తెలిపింది. ఎన్నికల విషయంలో కోర్టు జోక్యం చేసుకోవడం లేదని కూడా స్పష్టం చేసింది.

FOLLOW US :

@WHATSAPP | @TELEGRAM | @FACEBOOK