Very heavy rains – రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత భారీ వర్షాలు

BIKKI NEWS (AUG. 19) : Heavy to very heavy rains in telangana. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 24 గంటల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రాత్రి నుండి రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Heavy to very heavy rains in telangana

ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, వికారాబాద్, జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని చెప్పింది.

అత్యధికంగా సిద్దిపేట జిల్లా గౌరారంలో 23.6, మెదక్‌ జిల్లా అల్లాదుర్గ్‌లో 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని టీజీడీపీఎస్‌ పేర్కొంది.

ఈ నేపథ్యంలో అత్యంత భారీ వర్షాలు కురిసే జిల్లాలలో విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని తల్లిదండ్రుల నుండి విద్యార్థుల నుండి డిమాండ్ వస్తున్నాయి. ఇప్పటికీ మంగళవారం రోజున సిద్ధిపేట జిల్లాలోని పాఠశాలలకు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే.