BIKKI NEWS (SEP. 13) : heavy to very heavy rain alert in Telangana and Andhra Pradesh. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
heavy to very heavy rain alert in Telangana and Andhra Pradesh
ఈరోజు నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో, రేపటి నుంచి 16 వరకు ఆదిలాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా లలో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది.
అటు అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖ అంచనా వేసింది.

