GST – ఇక రెండు శ్లాబులే.!

BIKKI NEWS (AUG. 16) : GST 2 SLABS ONLY. జీఎస్టీ లో భారీ తగ్గింపులు ఉంటాయని ప్రధాని నరేంద్ర మోడీ స్వతంత్ర దినోత్సవం ప్రసంగంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

GST 2 SLABS ONLY

ఈ నేపథ్యంలో జీఎస్టీ లో ప్రస్తుతం ఉన్న 5, 12, 18, 28% రేట్లు కు బదులుగా కేవలం రెండు శ్లాబులను మాత్రమే ఉంచనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిందని సమాచారం.

ఈ జీఎస్టీ శ్లాబుల మార్పు అంశంపై సెప్టెంబర్ జీఎస్టీ కౌన్సిల్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

అయితే లగ్జరీ వస్తువులపై ప్రత్యేకంగా 40 శాతం జీఎస్టీ రేటును ప్రత్యేకంగా వేయనున్నట్లు సమాచారం.

5 , 18% జిఎస్టి శ్లాబులు మాత్రమే దీపావళి నుండి అమలులోకి వస్తాయని సమాచారం. దీంతో సామాన్యులపై పన్ను భారం మరింతగా తగ్గనుంది.

28% పన్ను పరిధిలో ఉన్న వస్తువులను 40% పరిధిలోకి తీసుకువెళ్ళనున్నట్లు సమాచారం. దీంతో లగ్జరీ వస్తువులు మరింత ప్రియం కానున్నాయి.

అలాగే 12 శాతం పరిధిలో ఉన్న వస్తువులను 5 శాతం లేదా 18% పన్ను పరిధిలోకి తీసుకువెళ్లనున్నారు.