Forum for Telangana letter to CM on inter merger – ఇంటర్ విలీన ప్రక్రియ అసంబద్ధం – ఫోరమ్ ఫర్ తెలంగాణ

Forum for telangana letter to cm on inter merger

BIKKI NEWS (Nov 26) : Forum for Telangana letter to CM on inter merger. తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను పాఠశాల విద్యలో విలీనం చేయాలన్న ప్రతిపాదనను, నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, ఫోరమ్ ఫర్ తెలంగాణ కన్వీనర్ ఆచార్య జగదీశ్వర్‌రావు వీరనేని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారిక లేఖ రాశారు.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Forum for Telangana letter to CM on inter merger

ఇంటర్ కళాశాలల్లో 9, 10 తరగతుల నిర్వహణకు అనుమతులు ఇస్తే స్థానిక విద్యార్థుల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని ఆయన తన లేఖలో స్పష్టం చేశారు:

ఇవి చదివారా :

స్థానిక కోటాలో (MBBS, BDS) తీవ్ర నష్టం: తెలంగాణలో ఎంబీబీఎస్ (MBBS), బీడీఎస్ (BDS) తదితర మెడికల్ కోర్సుల్లో స్థానిక కోటా కింద సీట్లు పొందాలంటే 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు వరుసగా నాలుగేళ్లు తెలంగాణలోనే చదివి ఉండాలన్న నిబంధన, సుప్రీంకోర్టు తీర్పు ఉంది.

ఇతర రాష్ట్రాల విద్యార్థులకు అవకాశం: ఒకవేళ ఇంటర్మీడియట్ కళాశాలల్లో 9, 10 తరగతుల బోధనకు అనుమతి ఇస్తే, ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఇక్కడికి వచ్చి తొమ్మిదో తరగతి నుంచి వరుసగా నాలుగేళ్లు చదివి స్థానిక కోటాలో సీట్లు పొందే అవకాశం ఏర్పడుతుంది. ఫలితంగా తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు తమకు దక్కాల్సిన స్థానిక సీట్లను కోల్పోయి తీవ్రంగా నష్టపోతారు.

కార్పొరేట్ కళాశాలలకే ప్రయోజనం: 9 నుండి 12వ తరగతి వరకు ఒకేచోట అనుమతులు ఇవ్వడం వల్ల కేవలం కార్పొరేట్ విద్యాసంస్థలకే మేలు జరుగుతుందని, కాబట్టి ప్రభుత్వం ఈ విలీన నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని ఆచార్య జగదీశ్వర్‌రావు కోరారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →