Inter Exam Fee Last Date 2026 – నేటితో ముగుస్తున్న ఇంటర్ పరీక్షల ఫీజు గడువు

Inter exam fee last date 2026

BIKKI NEWS : Inter Exam Fee Last Date 2026 . తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలక అలర్ట్. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 2027కు సంబంధించి ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించేందుకు నిర్ణయించిన గడువు నేటితో (నవంబర్ 9) ముగియనుంది. ఇప్పటివరకు పరీక్ష ఫీజు చెల్లించని మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు వెంటనే ఫీజు చెల్లించాలని ఇంటర్మీడియట్ బోర్డు సూచించింది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Inter Exam Fee Last Date 2026

తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన అక్టోబర్ 15, 2026 తేదీ ప్రెస్ రిలీజ్ ప్రకారం.. మార్చి 2027లో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను ప్రకటించింది.

ఫీజు చెల్లింపు వివరాలుతేదీలు
సాధారణ ఫీజుతోఅక్టోబర్ 26 – నవంబర్ 9
రూ.100 ఆలస్య రుసుముతోనవంబర్ 11 – 20
రూ.500 ఆలస్య రుసుముతోనవంబర్ 22 – 29
రూ.1,000 ఆలస్య రుసుముతోడిసెంబర్ 1 – 7
రూ.2,000 ఆలస్య రుసుముతోడిసెంబర్ 9 – 14

ఇంటర్ పరీక్ష ఫీజు ఎంతంటే?

బోర్డు ప్రకటించిన వివరాల ప్రకారం పరీక్ష ఫీజులు ఇలా ఉన్నాయి.

విద్యార్థుల విభాగంపరీక్ష ఫీజు
ఫస్ట్ ఇయర్ జనరల్రూ.540
ఫస్ట్ ఇయర్ ఒకేషనల్రూ.890
సెకండ్ ఇయర్ జనరల్ ఆర్ట్స్రూ.540
సెకండ్ ఇయర్ జనరల్ సైన్స్రూ.890
సెకండ్ ఇయర్ ఒకేషనల్రూ.890

ఎవరెవరు ఫీజు చెల్లించాలి?

  • ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులు.
  • ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులు.
  • జనరల్, ఒకేషనల్ విభాగాల ఫెయిలైన విద్యార్థులు.
  • కాలేజీ చదువుతో సంబంధం లేకుండా పరీక్షలకు హాజరయ్యే అర్హత కలిగిన ప్రైవేట్ విద్యార్థులు.

Inter Exam Fee Last Date 2026 – విద్యార్థులకు ముఖ్యమైన సూచన

సాధారణ ఫీజుతో పరీక్ష ఫీజు చెల్లించేందుకు నవంబర్ 9 చివరి తేదీ. ఈ గడువు ముగిసిన తర్వాత ఆలస్య రుసుముతో మాత్రమే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి విద్యార్థులు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా తమ కళాశాలల ద్వారా ఫీజు చెల్లింపు ప్రక్రియను పూర్తి చేసుకోవాలి

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →