BIKKI NEWS (July 31) : Employees pending bills for July 2026. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చెల్లింపు కొరకు 2 వేల కోట్ల రూపాయలను విడుదల చేసింది. దీంతో 100 రోజుల్లో 6 వేల కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు అయింది.
Employees pending bills for July 2026.
రిటైర్డ్ ఉద్యోగుల కమ్యూటేషన్ బిల్లులు మొత్తం ఈ నిధులతో సర్దుబాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం ప్రకారం 100 రోజుల్లో 6 వేల కోట్ల రూపాయలను ఉద్యోగుల పెండింగ్ బిల్లుల కోసం చెల్లించడం ఉద్యోగుల పట్ల ప్రభుత్వ సానుకూల వైఖరిని సూచిస్తుందని భట్టి ఈ సందర్భంగా ప్రకటన విడుదల చేశారు.
