CRIMINAL CASES – ఏ ముఖ్యమంత్రి పై ఎన్ని కేసులు

BIKKI NEWS (AUG. 23) : Criminal cases on chief ministers – ADR ఇండియా లో 30 మంది ముఖ్యమంత్రులు ఉండగా వారిలో 12 మందిపై క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ సంస్థ వెల్లడించింది. దేశంలోని 30 మంది ముఖ్యమంత్రులు ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఏడీఆర్ ఈ వివరాలు వెల్లడించింది.

Criminal cases on chief ministers – ADR

ముఖ్యమంత్రుల్లో 10మందిపై హత్యాయత్నం, కిడ్నాప్, లంచగొండితనం, నేరపూరిత బెదిరింపు వంటి తీవ్రమైన నేరారోపణలు నమోదయ్యాయి.

  • రేవంత్ రెడ్డి – 89 కేసులు
  • ఎం. కె. స్టాలిన్ – 47 కేసులు
  • చంద్రబాబు నాయుడు – 19 కేసులు
  • సిద్ధరామయ్య – 13 కేసులు
  • హేమంత్ సోరెన్ – 5 కేసులు
  • మంత్రి దేవేంద్ర ఫడణవీస్ – 4
  • సుఖ్వీందర్ సింగ్ – 4
  • పినరయి విజయన్ – 2
  • భగవంత్ మాన్ – 1

తీవ్రమైన నేరానికి పాల్పడినట్టు కేసు నమోదై 30 లేదా అంతకన్నా ఎక్కువ రోజులు జైలులో ఉన్న ప్రధానమంత్రి, ముఖ్య మంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులకు ఉద్వాసన పలికే బిల్లును కేంద్రం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో ఈ సమాచారం ప్రాధాన్యం సంతరించుకుది.