BIKKI NEWS (AUG. 31) : Change your GMail Password immediately. జీమెయిల్ వినియోగదారులు వెంటనే తమ పాస్ వర్డ్ ను మార్చుకోవాలని గూగుల్ సంస్థ సూచించింది.
Change your GMail Password immediately
ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 250 కోట్ల మంది జీమెయిల్ ఖాతాల సమాచారం ప్రమాదంలో ఉందని ఈ సందర్భంగా హెచ్చరించింది.
సేల్స్ ఫోర్స్ డేటా తస్కరణ (BREACH) అయిన నేపథ్యంలో ఈ ప్రమాదం ఏర్పడిందని గూగుల్ పేర్కొంది. 2025 జూన్ ప్రథమార్థంలో ఈ ఘటన చోటుచేసుకుందని వివరించింది.
ఈ హ్యాకర్స్ తాజాగా వినియోగదారులకు కాల్స్, మెసేజెస్ చేస్తున్నారని, పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలని, లాగిన్ కోడ్స్ ఇవ్వాలని కోరుతున్నారని గూగుల్ హెచ్చరించింది.

