BIKKI NEWS (AUG. 14) : Cash prize to 10th and inter toppers in telangana. తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాల విద్యా శాఖ పరిధిలో ఉన్న విద్యాసంస్థల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్ లలో జిల్లా టాపర్లకు నగదు బహుమతి అందజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Cash prize to 10th and inter toppers in telangana.
ఈ నగదు బహుమతిని స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 15న జిల్లాల వారీగా అందజేయాలని నిర్ణయించారు.
ప్రతి జిల్లాలో ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలకు ఒక్కొక్కరికి రూ.10 వేల రూపాయల చొప్పున నగదు బహుమతి అందజేయాలని నిర్ణయించారు.
అంటే ప్రతి జిల్లాలో పదో తరగతిలో నలుగురికి, ఇంటర్మీడియట్ లో నలుగురికి ఆయా జిల్లాల్లో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సన్మానించి, నగదు ప్రోత్సాహకాలు అందిస్తారు.
పాఠశాల విద్యాశాఖ పరిధిలో మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, జనరల్ గురుకులాల్లో ఇంటర్ విద్య ఉన్న సంగతి తెలిసిందే. వాటిల్లోని టాపర్లనే పరిగణనలోకి తీసుకుంటారు.

