BIKKI NEWS (June 29) : BSc agriculture 2026 admissions by EAPCET. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ ఉద్యానవన యూనివర్సిటీ, పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బీటెక్ వ్యవసాయ ఇంజినీరింగ్, బీటెక్ ఆహార సాంకేతికత, బీఎస్సీ హోంసైన్స్, బీఎఫ్‌ఎస్‌సీ, బీవీఎస్‌సీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడులైంది.
BSc agriculture 2026 admissions by EAPCET
తెలంగాణ ఎఫ్‌సెట్ -2026 లో ఎంపీసీ, బైపీసీ విభాగాలలో ఉత్తీర్ణులైన విద్యార్థులు జూలై నెల 25 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఎడిట్ అవకాశం జూలై 27వ తేదీన కలదు.
కోర్సుల వివరాలు :
BSc agriculture (Hons)
BSc Horticulture (Hons)
BTech Food Technology
దరఖాస్తు ఫీజు : 3,000/- రూపాయలు. SC, ST, PH – 1,500/- రూపాయలు.
అర్హతలు : సైన్స్ విభాగంలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. తెలంగాణ ఎఫ్‌సెట్ 2026 అర్హత సాధించి ఉండాలి.
బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్ , ఫుడ్ టెక్నాలజీ 25% సీట్లను గ్రామీణ ప్రాంతాల్లోని రైతు కుటుంబాల విద్యార్థులకు కేటాయిస్తారు. వ్యవసాయ కూలీలకు 15% సీట్లను కేటాయిస్తారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థికి లేదా వారి తల్లిదండ్రులకు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జాబ్‌కార్డు ఉండాలి.
విద్యార్థి 4వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ మధ్య కనీసం 4 ఏళ్లు ప్రభుత్వ పాఠశాలలు లేదా కళాశాలలో చదివి ఉండాలి. ఎలాంటి భూమి లేదని తహసీల్దారు నుంచి పొందిన ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.
దరఖాస్తు లింక్ : Apply here
వెబ్సైట్ : https://ug.pjtau.ac.in/

