Skip to content
November 8, 2025

bikkinews.in

Telugu news website

  • Home
  • LATEST NEWS
  • JOBS
  • EDUCATION
  • CURRENT AFFAIRS
  • GK BITS
  • GENERAL STUDIES
  • Scholarships
  • SPORTS
  • BUSINESS NEWS
  • TELANGANA NEWS
  • NATIONAL NEWS
  • ANDHRA PRADESH NEWS
  • ESSAYS
  • INTERNATIONAL NEWS
  • About Us
  • Contact Us
  • Today in history
  • Privacy Policy
Main Menu

వేతనంలో 10% పేరెంట్స్ ఖాతాలోకి వెళ్లే చట్టం – సీఎం రేవంత్ రెడ్డి

September 27, 2025September 27, 2025

BIKKI NEWS (SEP. 27) : act of 10% salary to parents account in Telangana .కొత్తగా గ్రూప్ -1 ఉద్యోగాలకు ఎంపికైన యువతీ యువకులు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. “తెలంగాణ భవిష్యత్ నిర్మాణ బాధ్యత మీ చేతుల్లో ఉంది. ఒక బాధ్యతతో వ్యవహరించండి. మనమంతా కలిసి తెలంగాణను దేశానికి ఒక మోడల్‌గా నిలబెడదాం” అని దిశానిర్దేశం చేశారు.

act of 10% salary to parents account in Telangana

హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రజా పాలన – కొలువుల పండుగలో భాగంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన Group-1 లో ఎంపికైన 562 మంది అభ్యర్థులకు ముఖ్యమంత్రి గారు నియామక పత్రాలను అందించారు.

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి గారు, ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు, వారి తల్లిదండ్రులకు శుభాభినందనలు తెలియజేశారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ.. “గ్రూప్-1 కు ఎంపికైన అభ్యర్థుల భుజాలపై తెలంగాణ భవిష్యత్తు పునర్నిర్మాణ బాధ్యత ఉంది. ఇదొక గొప్ప అవకాశం. బాధ్యతతో వ్యవహరించి నియామకాలు చేపట్టాం. ప్రభుత్వం ఒక గొప్ప లక్ష్యంతో ముందుకు వెళుతోంది.

స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తయ్యే 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగాలన్న లక్ష్య సాధనలో మీ వంతు పాత్ర పోషించాలి. గుజరాత్ మాడల్ అనో, ఇంకేదో అనో కాదు. మన పోటీ దేశంతోనే కాదు. ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణను తీర్చిదిద్దాలి. అందుకు కంకణబద్దులై పనిచేయండి.

ఉద్యోగంలో చేరిన కొత్తలో గరం, గరంగా ఉండి, తర్వాత నరం, నరంగా మారి క్రమేణా బేషరంగా మారుతారన్న నానుడి తప్పు అని నిరూపించే బాధ్యత మీపై ఉంది. ఒక నిరుపేద, నిస్సహాయుడు మీవద్దకు వచ్చినప్పుడు వారికి సేవ చేసే విషయంలో మీ తల్లిదండ్రులు గుర్తుకు రావాలి. మీరంతా నిన్నటి వరకు నిరుద్యోగ యువకులు. ఈ రోజు నుంచి ఆఫీసర్లు. అఫీసర్లకు ఎంతో బలం ఉంది. మీ భవిష్యత్తుకు అది గ్రీన్ చానెల్.

మీ భవిష్యత్తును తీర్చిదిద్దాలని రూపాయి, రూపాయి కూడబెట్టి మీకోసం సర్వం త్యాగం చేసిన మీ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి. ఉద్యోగులెవరైనా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే వారి జీతాల్లో 10 శాతం కోత పెట్టి తల్లిదండ్రుల ఖాతాల్లో వేసే చట్టం తెస్తాం.

గ్రూప్ -1 ఉద్యోగం సాధించడానికి 3 లక్షలకుపైగా అభ్యర్థులు పోటీ పడితే అందులో 562 మంది ఎంపికయ్యారు. మీలో ఉన్న నైపుణం, చైతన్యం, పట్టుదల కారణంగా మీరు తెలంగాణ అభివృద్ధికి భాగస్వామ్యులయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో 2011 లో గ్రూప్ 1 నిర్వహిస్తే ఆ తర్వాత గత ప్రభుత్వం గ్రూప్ -1 నిర్వహించాలన్న ఆలోచన చేయలేదు.

ఏ ఆకాంక్ష కోసం తెలంగాణ ఏర్పాటు చేసుకున్నామో, గడిచిన పదేండ్లలో ఆ ఆకాంక్ష నెరవేరలేదు. తెలంగాణ కోసం ఎంతో మంది ప్రాణ త్యాగం వల్ల సాధించిన తెలంగాణ ఒక కుటుంబ ప్రయోజనం కోసం కాదు.

పెద్ద పెద్ద ఉద్యోగాలను నియమించే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చిన్న చిన్న హోదాల్లో ఉన్న వారిని నియమించడమే కాకుండా ఆ రోజు ప్రశ్నాపత్రాలు పల్లీబఠాణీలుగా జిరాక్స్ సెంటర్లలో లభించే విధంగా పోటీ పరీక్షలను అపహాస్యం చేశారు.

ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను యూపీఎస్సీ కన్నా ఉన్నతంగా ఉంచాలని కమిషన్‌ను ప్రక్షాళన చేశాం. అది నచ్చని కొంతమంది కడుపుమంటతో చేయని ప్రయత్నాలు లేవు. ఉద్యోగాలను అమ్ముకున్నారని అపవాదు వేశారు. నేను, మంత్రివర్గ సహచరులం మంచి చేయాలన్న ఒక సంకల్పంతో పనిచేశాం.

ఆరోపణలు చేసినప్పటికీ ఓపికతో దిగమింగుకున్నాం. డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయంలో కూడా అంత ఆందోళన చెందలేదు. కానీ గ్రూప్-1 కోసం ఆందోళన చెందా. ఒక మంచి సంకల్పంతో పని చేసినప్పుడు లక్ష్యం ముందుండాలి తప్ప మరొకటి కాదు” అని ఉద్ఘాటించారు.

ఈ కొలువుల పండుగలో మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, జూపల్లి కృష్ణారావు గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, వాకిటి శ్రీహరి గారు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపికైన అభ్యర్థులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు ప్రతిజ్ఞ చేయించారు.

  • DONALD TRUMP – భూమినీ 150 సార్లు పేల్చేయగలం
  • LOAN – లోన్ తీసుకున్న వారికి గుడ్ న్యూస్
  • DAILY GK BITS 52 – జీకే బిట్స్
  • ఉద్యోగుల సెలవులు రద్దు – కార్యదర్శి శ్రీ కృష్ణ ఆదిత్య
  • Today in history – చరిత్రలో ఈరోజు నవంబర్ 08

Related Posts

ఉద్యోగుల సెలవులు రద్దు – కార్యదర్శి శ్రీ కృష్ణ ఆదిత్య

November 8, 2025November 8, 2025

Regularization – కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్దీకరించండి – హైకోర్టు

November 6, 2025November 6, 2025

ఆ నియామకాలు చెల్లవు – హైకోర్టు కీలక తీర్పు

November 6, 2025November 6, 2025

Post navigation

Previous Article TGPSC – ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ తుది ఫలితాలు విడుదల
Next Article VIJAY – తొక్కిసలాటలో 31 మంది మృత్యువాత.!

తాజా వార్తలు | ఉద్యోగాలు | విద్య | ఫలితాలు | బిజినెస్ | కరెంట్ అఫైర్స్ | ఆన్లైన్ టెస్ట్స్ | ఎంప్లాయీస్ న్యూస్ | రైతు వార్తలు | జీకే బిట్స్ | జనరల్ స్టడీస్ | స్కాలర్షిప్ | చరిత్రలో ఈరోజు | తెలంగాణ | ఏపీ | జాతీయం | అంతర్జాతీయం | క్రీడలు | వ్యాసాలు | భక్తి | వాతావరణం

తాజా వార్తలు

DONALD TRUMP – భూమినీ 150 సార్లు పేల్చేయగలం

November 8, 2025November 8, 2025

LOAN – లోన్ తీసుకున్న వారికి గుడ్ న్యూస్

November 8, 2025November 8, 2025

DAILY GK BITS 52 – జీకే బిట్స్

November 8, 2025November 8, 2025

ఉద్యోగుల సెలవులు రద్దు – కార్యదర్శి శ్రీ కృష్ణ ఆదిత్య

November 8, 2025November 8, 2025

Today in history – చరిత్రలో ఈరోజు నవంబర్ 08

November 8, 2025November 8, 2025

Radiology day – అంతర్జాతీయ రేడియాలజి దినోత్సవం,

November 8, 2025November 8, 2025

CURRENT AFFAIRS NOVEMBER 8th 2025 – కరెంట్ అఫైర్స్

November 7, 2025November 7, 2025

Free NEET long term coaching – నీట్ లాంగ్‌టర్మ్ కోచింగ్

November 7, 2025November 7, 2025

3 రోజులు సెలవులు

November 7, 2025November 7, 2025

REOPEN – కళాశాలలు రేపటి నుంచి రీ ఓపెన్

November 7, 2025November 7, 2025

NO HOLIDAY – రేపు సెలవు లేదు

November 7, 2025November 7, 2025

ZOOLOGY ONLINE TEST 08

November 7, 2025November 7, 2025

GHMC JOBS – జీహెచ్ఎంసీ లో ఔట్ సోర్సింగ్ జాబ్స్

November 7, 2025November 7, 2025

GOLD RATE – ఈరోజు బంగారం, వెండి, ప్లాటినం ధరలు

November 7, 2025November 7, 2025

BOTANY ONLINE TEST 08

November 7, 2025November 7, 2025

myrmecophobia – చీరలంటే భయంతో ఆత్మహత్య

November 7, 2025November 7, 2025

CABINET MEETING – 12న కేబినెట్ సమావేశం

November 7, 2025November 7, 2025

AP POLICE JOBS – 264 పోలీస్ ఉద్యోగాల భర్తీకి అనుమతి

November 7, 2025November 7, 2025

CPGET COUNSELLING – ఎంఈడీ, ఎంపీఈడీ కౌన్సిలింగ్

November 7, 2025November 7, 2025

రైతులకు 9,600/- ఆర్థిక సహాయం

November 7, 2025November 7, 2025

HOME | ABOUT US | CONTACT US | PRIVACY POLICY

Copyright © 2025 bikkinews.in.
Powered by WordPress and HitMag.
error: Content is protected !!