Today in history 11th February – చరిత్రలో ఈరోజు

Today in history 11th February
  • BIKKI NEWS : 11-02-2026

Today in history 11th February – చరిత్రలో ఈరోజు

Today in history 11th February

దినోత్సవం

  • అంతర్జాతీయ మహిళా, బాలికల దినోత్సవం
  • హ్యాపీ ప్రామిస్ డే

సంఘటనలు

1922: సహాయ నిరాకరణోద్యమాన్ని నిలిపివేయాలని బార్డోలీలో జరిగిన కాంగ్రెస్ సమావేశం నిర్ణయించింది.
1975: మార్గరెట్ థాచర్ బ్రిటన్ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికైంది.
1990: 27 సంవత్సరాల జైలు జీవితం నుంచి నెల్సన్ మండేలాకు స్వేచ్ఛ లభించింది.
2023: హైదరాబాదులోని హుసేన్ సాగర్ తీరాన వరల్డ్‌ ఛాంపియన్‌ షిప్‌ ఫార్ములా ఈ రేసు నిర్వహించబడింది. ఈ రేసులో జీన్‌ ఎరిక్‌ విన్నర్‌గా, రెండో స్థానంలో నిక్‌ క్యాసిడీ, మూడో స్థానంలో సెబాస్టియన్‌ బ్యూమీ నిలిచారు.

జననాలు

1847: థామస్ ఆల్వా ఎడిసన్, విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్ కనిపెట్టిన అమెరికన్ శాస్త్రవేత్త, వ్యాపారవేత్త. (మ.1931)
1865: పానుగంటి లక్ష్మీ నరసింహారావు, తెలుగు సాహితీవేత్త, హాస్య, వ్యంగ్య, అధిక్షేప రచయిత. (మ.1940)
1899: గురజాడ రాఘవశర్మ, స్వాతంత్ర్య సమరయోధులు, కవి, బహుగ్రంథకర్త. వీరు గురజాడ అప్పారావు గారి వంశీకులు. (మ.1987)
1917: తరిమెల నాగిరెడ్డి, కమ్యూనిస్టు నాయకుడు. (మ. 1976)
1932: రావి కొండలరావు, తెలుగు సినిమా నటుడు, రచయిత. నిర్మాత ,దర్శకుడు, ( మ.2020)
1958: పెన్మెత్స సుబ్బరాజు, బైబిల్ పై అనేక విమర్శనా గ్రంథాలు రాశారు.
1967: మాలినీ అవస్థి భారతీయ జానపద గాయని. పద్మశ్రీ పురస్కార గ్రహీత.

మరణాలు

1868: లీయాన్ ఫోకాల్ట్, ప్రాన్స్ కు చెందిన భౌతిక శాస్త్రవేత్త. (జ.1819)
1942: జమ్నాలాల్ బజాజ్, వ్యాపారవేత్త, భారత స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1889)
1974: ఘంటసాల వెంకటేశ్వరరావు, తెలుగు సినిమా సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు. (జ.1922)
1977: ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, భారత ఐదవ రాష్ట్రపతి. (జ.1905)
1996: ఆలపాటి రవీంద్రనాధ్, జ్యోతి, రేరాణి, సినిమా, మిసిమి పత్రికల స్థాపకుడు. (జ.1922)
2010: లక్ష్మీదేవమ్మ, ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ.
2018: ఆస్మా జహంగీర్, పాకిస్తాన్‌కు చెందిన సామాజిక శాస్త్రవేత్త, రామన్ మెగసెసే పురస్కార గ్రహీత. (జ.1952)

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of BIKKI NEWS

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →