Today in history August 15th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 15

Today in history august 15th - చరిత్రలో ఈరోజు ఆగస్టు 15 - bikki news

BIKKI NEWS : Today in history August 15th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 15

Today in history August 15th

దినోత్సవం

  • భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం.
  • రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో (బ్రజ్జావిల్లె) స్వాతంత్ర్య దినోత్సవము.
  • బహ్రెయిన్ స్వాతంత్ర్య దినోత్సవం.
  • పశ్చిమ బెంగాల్ దినోత్సవం.
  • బంగ్లాదేశ్ జాతీయ సంతాప దినం

సంఘటనలు

1519: పనామా దేశంలోని, పనామా సిటీ స్థాపించబడింది. శ్రీకృష్ణదేవరాయల కాలం.
1535: పరాగ్వే దేశపు రాజధాని నగరం, అసున్సియన్ స్థాపించబడింది. శ్రీకృష్ణదేవరాయల కాలం.
1540: పెరూ దేశంలోని, అరెక్విప నగరం స్థాపించబడింది. శ్రీకృష్ణదేవరాయల కాలం.
1822: 1822 జనాభా లెక్కలు ప్రకారం అప్పర్ కెనడాలో 1,20,000 మంది, లోయర్ కెనడా లో,500,000 మంది ప్రజలు నివసించేవారు.
1834: 1834 లో బ్రిటన్ పార్లమెంట్, చేసిన “సౌత్ ఆస్ట్రేలియా చట్టము” ప్రకారము, అక్కడ వలస (కోలనీ) ఏర్పాటు చేసుకోవటానికి అనుమతి లభించింది.
1858: పసిఫిక్ సముద్రతీరప్రాంతానికి, ప్రతీ రోజూ ఉత్తరాల పంపిణీ జరగటం మొదలు అయ్యింది.
1889: ఆసియా లోనే, అతి పురాతనమైన, మోహన్ బాగన్ ఎ.సి. కలకత్తాలో స్థాపించబడింది.
1870: ట్రాన్స్ కాంటినెంటల్ రైల్వే మార్గము పూర్తి అయ్యింది.
1889: 15 ఆగష్ట్ నుంచి 16 సెప్టెంబరు వరకు జరిగిన ది గ్రేట్ లండన్ డాక్ స్ట్రైక్ వలన, బ్రిటిష్ ట్రేడ్ యూనియనిజం, నిపుణులైన కార్మికుల నుంచి, తక్కువ నిపుణత ఉన్న కార్మికులకు పాకింది.

1900 సంఘటనలు


1901: కాడిలాక్ మోటార్ కంపెనీ డెట్రాయిట్లో స్థాపించబడింది.
1914: అంకన్ అనే పేరుగల సరుకుల ఓడ (రవాణా ఓడ), అట్లాంటిక్ మహాసముద్రం నుంచి పసిఫిక్ మహాసముద్రం లోకి, పనామా కాలువ ద్వారా, ప్రయాణించటంతో, పనామా కాలువ ప్రారంభమైంది.
1944: ఫ్రాన్స్ దక్షిణాన, మిత్ర దేశాల దళాలు దిగి, మార్సీల్స్ పట్టణాన్ని, తిరిగి స్వాధీనం చేసుకున్నాయి.
1938: ఆంధ్రప్రభ దినపత్రిక చెన్నై (నాటి మద్రాసు) లో, పారిశ్రామిక వేత్త రామనాధ్ గోయెంకా మొదలు పెట్టాడు.
1945: కొరియా తనంతట తానే, ఒక గణతంత్రదేశంగా ప్రకటించుకుంది.
1947: భారత దేశానికి బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం లభించింది.
47: స్వతంత్ర భారతదేశం గవర్నర్ జనరల్‌గా లూయీ మౌంట్‌బాటెన్ నియామకం.
47 : పాకిస్తాన్ స్థాపకుడు ముహమ్మద్ ఆలీ జిన్నా మొదటి పాకిస్తాన్ గవర్నర్ జనరల్ గా, కరాచీలో పదవిని స్వీకరించాడు.
1950: విశాఖపట్నం జిల్లా నుంచి 1950 ఆగష్టు 15 న శ్రీకాకుళం జిల్లా ఏర్పడిన రోజు.
1950: అస్సాంలో భూకంపం 8.6 రెక్టర్ స్కేల్ మీద. 1,000 మందికి పైగా మరణించారు.
1960: రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో (బ్రజ్జావిల్లె), ఫ్రాన్స్ నుంచి స్వతంత్రం ప్రకటించుకుంది.
1960: ముగ్గురు కాలిఫోర్నియా కాపలాదారులు, ఎగిరే పళ్ళాలు (గుర్తుపట్టలేని ఫ్లైయింగ్ వస్తువులు) చూసామని చెప్పారు.

1900 సంఘటనలు (2)


1961: తూర్పు జర్మనీలో బెర్లిన్ గోడ కట్టటం మొదలైంది. జర్మనీ ప్రజలకు చీకటి రోజు
1965: లాస్ ఏంజిల్స్ లోని, జాతి కలహాలు నివారించటానికి, అమెరికాకి చెందిన నేషనల్ గార్డ్ని పిలిచారు.
1965: బీటిల్స్, న్యూయార్క్ లోని, షియా స్టేడియంలో పాటలు పాడారు.
1969: వుడ్ స్టాక్ సంగీత ఉత్సవం మాక్స్ యాస్గర్ ఫార్మ్లో ప్రారంభించారు.
1971: బహ్రెయిన్, బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందింది.
1971: అమెరికా అధ్యక్షుడు నిక్సన్, జీతాలు, ధరలు, అద్దెల మీద 90 రోజుల పాటు స్తంభింపచేసాడు.
1974: దక్షిణ కొరియా స్వాతంత్ర్య దినోత్సవాలలో పాల్గొంటున్న, దక్షిణ కొరియా, అధ్యక్షుడు [[పార్క్ చంగ్ హీ]] మీద జరిగిన హత్యా ప్రయత్నంలో, దక్షిణ కొరియా, ప్రథమ మహిళ యూక్ యంగ్ సూ, మరణించింది.
1975: బంగ్లాదేశ్లో సైనిక కుట్ర. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ ముజిబుర్ రెహ్మాన్ ని, అతని కుటుంబసభ్యులను (హసీనా వజీద్ ని తప్ప) చంపారు.
1977: ’ఓహియో రాష్ట్ర యూనివర్సిటీ’ లో “సెటి” ప్రాజక్టులో భాగంగా, నెలకొల్పిన, ’ది బిగ్ ఇయర్, అనేపేరుగల రేడియో టెలిస్కోప్ కి విశ్వాంతరాళం లోతుల నుంచి ఒక రేడియో సిగ్నల్ అందింది. దానిని “వౌ సిగ్నల్” అనే పేరు పెట్టారు.
1983: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా రామ్ లాల్ నియమితులయ్యాడు.


2006: ఎయిడ్స్ సమావేశము : క్లింటన్, గేట్స్, అమెరికా అధ్యక్షుడి ప్రణాళికను సమర్ధించారు.
2006: శీతలీకరించిన వీర్యం పై చేసిన పరిశోధన, అంతరించి పోయిన పాలిచ్చే జంతువులు (మమ్మాల్స్) తిరిగి పునఃసృష్టి చేయగలమనే ఆశలు కలిగిస్తున్నది
2007: పసిఫిక్ మహాసముద్రం తీరంలోని ఇకా, పెరూ దేశంలోని పలుప్రాంతాలలో, భూకంపం, 8.0- (మేగ్నిట్యూడ్) రెక్టర్ స్కేల్ మీద వచ్చి, 514 మంది మరణించగా, 1,090 మంది గాయపడ్డారు.

జననాలు

1769: నెపోలియన్, ఫ్రెంచ్ చక్రవర్తి. (మ.1821)
1771: సర్ వాల్టర్ స్కాట్, స్కాటిష్ నవలా రచయిత.
1888: టి.ఇ. లారెన్స్, ‘లారెన్స్ ఆఫ్ అరేబియా’; సైనికుడు, రచయిత
1889: దండు నారాయణరాజు, స్వాతంత్ర్య సమరయోధులు. (మ.1944)
1895: వేమూరి గగ్గయ్య, తెలుగు రంగస్థల, సినిమా నటుడు. (మ.1955)


1902: మోటూరి సత్యనారాయణ, దక్షిణ భారతదేశంలో హిందీ వ్యాప్తిచేసిన మహా పండితుడు, స్వాతంత్ర్య సమరయోధులు. (మ.1995)
1913: బాడిగ వెంకట నరసింహారావు, కవి, సాహితీ వేత్త, బాల సాహిత్యకారుడు. (మ.1994)
1914: పరశురామ ఘనాపాఠి వేదపండితుడు. (మ.2016)
1915: ఇస్మత్ చుగ్తాయ్, ఉర్దూ అభ్యుదయ రచయిత్రి. (మ.1994)
1924: మల్లెమాల సుందర రామిరెడ్డి, తెలుగు రచయిత, సినీ నిర్మాత. (మ.2011)
1929: ద్వివేదుల విశాలాక్షి, కథా, నవలా రచయిత్రి. (మ.2014)
1931: నాగభైరవ కోటేశ్వరరావు, కవి, సాహితీవేత్త, సినిమా మాటల రచయిత. (మ.2008)
1935: రాజసులోచన, తెలుగు సినిమా నటి, కూచిపూడి, భరతనాట్య నర్తకి. (మ.2013)
1938: సుకుమారి, తెలుగుతో పాటు,పలు భాషా చిత్రాలలో,2000 పైగానటించిన నటి(మ.2013)
1945: రాళ్లపల్లి వెంకట నరసింహ రావు, తెలుగు చలనచిత్ర నటుడు(మ.2019)
1948: భారతి, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల నటి.గాయనీ, దర్శకురాలు.
1949: మైలవరపు గోపి, తెలుగు సినిమా రంగంలో ఒక ఉత్తమమైన భావాలున్న రచయిత. (మ.1996)
1949: దేవిప్రియ, పాత్రికేయుడు, కవి (మ.2020).
1961: సుహాసిని, దక్షిణ భారత సినిమా నటి.
1961: పందిళ్ళ శేఖర్‌బాబు, రంగస్థల (పౌరాణిక) నటుడు, దర్శకుడు, నిర్వాహకుడు. (మ.2015)
1964: శ్రీహరి, తెలుగు సినిమా నటుడు. ప్రతినాయకునిగా తెలుగు తెరకు పరిచయమై తరువాత నాయకుడిగా పదోన్నతి పొందిన నటుడు. (మ.2013)
1975: భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు విజయ్ భరద్వాజ్
1985: లయ (నటి), తెలుగు సినిమా నటీమణి.
1986: కాసోజు శ్రీకాంతచారి, మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరవీరుడు. (మ.2009)

మరణాలు

1935: అవ్వారి సుబ్రహ్మణ్యశాస్త్రి ఆశుకవి, శతావధాని. (జ.1883)
1942: మహదేవ్ దేశాయ్ భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత. (జ.1892)
1949: కొండా వెంకటప్పయ్య, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, దేశభక్త బిరుదాంకితుడు. (జ.1866)
2004: అమర్‌సిన్హ్ చౌదరి, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి. (జ. 1941).
2005: బెండపూడి వెంకట సత్యనారాయణ, చర్మవైద్యులు. (జ.1927)
2006: జి. వి. సుబ్రహ్మణ్యం, వైస్ ఛాన్సలర్, ఆచార్యుడు. (జ.1935)
2013: లాల్‌జాన్ బాషా, రాజకీయవేత్త, తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు. (మ.1956).
2018: అజిత్ వాడేకర్, భారత టెస్ట్ క్రికెట్ క్రీడాకారుడు. (జ.1941)
ఆగష్టు 15: మహ్మద్ హబీబ్, తెలంగాణకు చెందిన ఫుట్‌బాల్ ఆటగాడు. (జ. 1949)

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →