- BIKKI NEWS : 21-01-2026
Inter 2nd year classes in summer after public exams. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు పూర్తయిన వెంటనే ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ద్వితీయ సంవత్సరం తరగతులను మార్చి 31 వరకు బోధించేలా అనుమతించాలని ఇంటర్ బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం.
Inter 2nd year classes in summer after public exams
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ముగిసిన తర్వాత దాదాపు రెండున్నర నెలలపాటు విద్యార్థులకు వేసవి సెలవులు ఉంటున్నాయి. అయితే లాస్ట్ వర్కింగ్ డే మాత్రం మార్చి 31 గా ఉంటుంది.
దీంతో మార్చి 31 వరకైనా ఫస్ట్ ఇయర్ పూర్తయిన విద్యార్థులకు CBSE పద్దతిలో ద్వితీయ సంవత్సరం పాఠాలను బోధించేలా అనుమతించాలని బోర్డు కోరింది.
ఈ పద్ధతిని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు మార్చి 31 వరకు తరగతులు నిర్వహించే అవకాశం ఉంటుంది.
అయితే ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయిన వెంటనే స్పాట్ వాల్యూషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. దీంతో ఎంతమంది లెక్చరర్లు కళాశాలలో అందుబాటులో ఉంటారనేది ప్రధాన అంశంగా ఉండనుంది.
- Rain Holiday today – ఈ జిల్లాలలో పాఠశాలలకు సెలవు
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
