2 Crores TERM INSURANCE POLICY FOR STUDENTS – AXIS MAX. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు 2 కోట్ల వరకు టెర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలను ఆఫర్ చేస్తూ యాక్సిస్ మ్యాక్స్ ఇన్సూరెన్స్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది.
2 Crores TERM INSURANCE POLICY FOR STUDENTS – AXIS MAX
కేవలం ఉద్యోగులకు, ఆదాయం ఉన్న వారికి మాత్రమే ఇచ్చే ఈ పాలసీ ని ఆదాయం లేని వారికి టెర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఇవ్వరు అనే నిబంధన నుండి తొలిసారిగా యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ చదువుకుంటున్న విద్యార్థులకు కూడా టెర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ని తీసుకురావడం విశేషం.
టెర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని 18 ఏళ్ల వయసు నుండి అందజేయాలని సంకల్పంతో ఈ పాలసీని తీసుకొస్తున్నట్లు యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ తెలిపింది.
ప్రస్తుతం టెర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్న వారి సగటు వయసు 35 సంవత్సరాలుగా ఉందని తెలిపింది.
ఇన్సూరెన్స్ రంగంలో ఆదాయం లేని వారికి టెర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకురావడం ఇది ప్రథమం. ఉద్యోగం ఆరంభించడానికి ముందే వారికి ఆర్థిక క్రమశిక్షణ కల్పించడమే ఈ పాలసీ లక్ష్యమని తెలిపింది.

