BIKKI NEWS : Today in history August 8th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 08
Today in history August 8th
దినోత్సవం
- క్విట్ ఇండియా దినోత్సవం.
- జాతీయ డాలర్ దినోత్సవం
సంఘటనలు
1942: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, 1942 ఆగష్టు 8 తేదీన, క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించింది
1969: భారతదేశ లోక్‌సభ స్పీకర్‌గా గురుదయాళ్ సింగ్ ధిల్లాస్ పదవిని స్వీకరంచాడు.
2008: రాత్రి 8 గంటల 8 సెకెన్లకు చైనా దేశపు రాజధాని బీజింగ్ నగరములో 2008 ఒలింపిక్ క్రీడలు ప్రారంభం.
జననాలు
1870: చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి, అవధాన విద్యకు రూపురేకలు తీర్చిదిద్ది, వన్నెవాసి సమకూర్చిన తిరుపతి వేంకట కవులులో ఒకరు. (మ.1950)
1896: బాబా శివానంద్‌జీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన యోగా గురువు. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
1907: అనుముల వెంకటశేషకవి, నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ శతావధాని.
1914: శొంఠి శ్రీనివాసమూర్తి, ఉపాధ్యాయుడు, కవి. (మ. 1979)
1921: వులిమిరి రామలింగస్వామి, పాథాలజీ ప్రొఫెసర్ గా, డైరక్టర్ గా ఒక దశాబ్దం కాలం వ్యవహరించారు. డైరక్టర్ జనరల్ గా కూడా (1979-86) ఉన్నారు. (మ.2001)
1927: వక్కలంక సరళ , తెలుగు సినీ గాయని(మ.1999)
1929: పి.యశోదారెడ్డి, రచయిత్రి, తెలుగు అధ్యాపకురాలు. (మ.2007)
1936: మోదుకూరి జాన్సన్, నటులు, తెలుగు సినిమా సంభాషణల రచయిత, నాటక కర్త. (జ.1988)
1945: నంద్యాల వరదరాజులరెడ్డి, ప్రొద్దుటూరుకు చెందిన మాజీ శాసనసభ సభ్యుడు.
1946: కర్రెద్దుల కమల కుమారి, పార్లమెంటు సభ్యురాలు.
1950: పిల్లి సుభాష్ చంద్రబోస్, కాంగ్రెస్ పార్టీ తరఫున మూడవసారి శాసన సభ్యులు అయ్యాడు.
1950: వై.ఎస్.వివేకానందరెడ్డి, లోక్‌సభలకు కడప లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు.
1960: సున్నం రాజయ్య, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) కు చెందిన రాజకీయనాయకుడు. (మ.2020)
1964: డాక్టర్ శిరుపా రఘు, వైద్యులు, హనుమకొండ జిల్లా, తెలంగాణ
1980: బి.సదాశివ, సీపీఐ పార్టీ జిల్లా నాయకులు, కరీంనగర్ జిల్లా, తెలంగాణ
1981: రోజర్ ఫెడరర్, స్విట్జర్లాండ్ దేశానికి చెందిన టెన్నిస్ క్రీడాకారుడు.
2002: దాసరి నవీన్ యాదవ్, నారాయణ గూడెం గ్రామం, పెన్పహాడ్ మండలం, సూర్యాపేట జిల్లా, తెలంగాణ
మరణాలు
1987: గురజాడ రాఘవశర్మ, స్వాతంత్ర్య సమరయోధులు, కవి, బహుగ్రంథకర్త. వీరు గురజాడ అప్పారావు గారి వంశీకులు. (జ.1899)
1998: లాస్లో జాబో, హంగరీకి చెందిన అంతర్జాతీయ చెస్ గ్రాండ్ మాస్టర్ (జ.1917)
2004: పసుమర్తి కృష్ణమూర్తి, చలనచిత్ర నృత్యదర్శకుడు. (జ.1925)
2010: సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ, స్వాతంత్ర్య సమరయోధురాలు, సంఘసేవకురాలు. (జ.1914)
2020: నంది ఎల్లయ్య, మాజీ పార్లమెంటు సభ్యుడు (జ. 1942)
2020: మాదన నారాయణ, సీపీఐ రాష్ట్ర నాయకులు, తెలంగాణ. (జ.1940)

