BIKKI NEWS : DAILY GK BITS 77 FOR COMPITITIVE EXAMS. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జీకే బిట్స్.
DAILY GK BITS 77 FOR COMPITITIVE EXAMS.
1) భారతదేశంలోతొలిసారిగా ఉర్దూ భాషలో పుస్తకం వెలువరించిన రాజు ఎవరు.?
జ : మహమ్మద్ కులీ కుతుబ్ షా
2) ప్రపంచంలో అత్యంత పొడవైన అగ్నిపర్వత గొలుసు ఏ ఖండంలో ఉంది.?
జ : ఆస్ట్రేలియా
3) విద్యుత్ ప్రవహిస్తున్న వాహకం చుట్టూ అయస్కాంత క్షేత్రం ఉంటుందని తొలుత గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు?
జ : హాన్స్ క్రిస్టియన్ అయర్ స్టేడ్
4) తెలంగాణ విమోచన ఉద్యమ సమితి చైర్మన్ ఎవరు.?
జ : కాళోజి నారాయణరావు
5) హరిజనులు, అస్పృశులు, పంచములు అనే పదాల బదులు వారిని ఆది ఆంధ్రులు, ఆది హిందువులు అని పిలవాలని అన్నది ఎవరు.?
జ : భాగ్యరెడ్డి వర్మ
6) భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ లో కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన గురించి పేర్కొన్నారు.?
జ : ఏడవ షెడ్యూలు
7) తెలంగాణలో ఎర్ర ఇసుక, లోమ్ మృత్తికలు స్థానికంగా ఎలా పిలవబడతాయి.?
జ : చల్క నేలలు
8) ప్రపంచ నిమోనియా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : నవంబర్ 12
9) పెట్రోలియంలోని హైడ్రో కార్బన్లను వేరుపరచడంలో ఇమిడి ఉండే సూత్రము ఏది?
జ :అంశిక స్వేదనం
10) భారతదేశంలో అతి పెద్ద మడ అడవులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి.?
జ : పశ్చిమబెంగాల్
11) వాతావరణం లోని ఏ పొర ఏకరూప సమాంతర ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది.?
జ : స్ట్రాటో ఆవరణం
12) ఉద్వేగంలో ఉన్నప్పుడు అధికంగా ఉత్పత్తి అయ్యే హార్మోన్ ఏది .?
జ : అడ్రినలిన్
13) ప్రాణహిత అన్నది ఏ మూడు నదుల కలయిక వలన ఏర్పడుతుంది.?
జ : పెన్ గంగా, వార్ధ, వెయిన్ గంగా
14) సింధూ నది జలాల ఒప్పందం ప్రకారం భారతదేశానికి ఏ నదులపై పూర్తి హక్కులు ఇచ్చారు.?
జ : జీలం, రావి, బియాస్
15) నాగార్జునసాగర్ ఎడమ కాలువ పేరు ఏమిటి?
జ : లాల్ బహుదూర్ కాలువ
16) రైన్ ఆఫ్ ఇండియా అని ఏ నదిని పిలుస్తారు.?
జ : గోదావరి
17) నేపాల్ లో పుట్టి ఉత్తరప్రదేశ్ లో గంగా నదిలో కలిసే నది ఏది?
జ : గండక్
18) పదవ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా నిరమించబడి… ఎన్నికల్లో సంస్కరణలకు ఆధ్యుడిగా పిలవబడింది ఎవరు?
జ : టిఎన్ శేషన్
19) కేంద్రంలో మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో కాంగ్రేసేతర ప్రభుత్వం ఏర్పడింది.?
జ : 1977
20) ఎన్నికలలో ఓటు వేసిన ఓటరుకు ఏ వేలుకు సిరా చుక్కను పెడతారు.?
జ : ఎడమ చేయి చూపుడు వేలుకు
21) లోకాయుక్త తన నివేదికను ఎవరికి సమర్పిస్తారు.?
జ : గవర్నర్
22) లోకాయుక్తని ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఏది.?
జ : మహారాష్ట్ర
23) 42 వ రాజ్యాంగ సవరణ ద్వారా పీఠీకలో చేర్చబడిన పదము ఏది.?
జ : లౌకిక
24) సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారాన్ని సాధారణంగా ఎన్ని రోజులలో పొందవచ్చు.?
జ : 30 రోజులు
25) భారతదేశ మొదటి అంటార్కిటిక యాత్రను ఏ సంవత్సరంలో ప్రారంభించింది.?
జ : 1981
26) సమ వర్షపాత ప్రదేశాలను కలుపుతూ ఉండే రేఖ పేరు ఏమిటి?
జ : ఐసో హైట్
27) తీర ప్రాంత కోత కారణంగా లక్షద్వీప్ లోని ఏ దీపం అంతర్ధానం అయ్యింది.?
జ : పరలి – 1
28) మొక్కలపై శిలీంద్ర సంక్రమణకు ముందే రక్షకంగా ఉపయోగించే శిలింద్ర నాశనికి ఉదాహరణ.?
జ : సల్ఫర్
29) న్యూటన్ మొదటి సూత్రానికి గల మరొక పేరు ఏమిటి.?
జ : జడత్వ సూత్రము
30) భారతదేశపు తొలి సూపర్ కంప్యూటర్ కు ఉన్న పేరు ఏమిటి?
జ : పరమ్ – 8000
- Top current affairs in Telugu March 13th 2026 – టాప్ కరెంట్ అఫైర్స్
- LPCET 2026 – ఐటీఐ విద్యార్థులకు పాలిటెక్నిక్ ప్రవేశాలు
- Today Top News In Telugu March 13th 2026 – నేటి ప్రధాన వార్తలు
- Contract employees – కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి – హైకోర్టు
- free insurance to all – తెలంగాణ ప్రజలందరికీ ఉచిత బీమా, వైద్యం – సీఎం

