BIKKI NEWS (DEC. 30) : Telangana CETs 2026 exams dates released. తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్టులు –2026 షెడ్యూల్ విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి.
Telangana CETs 2026 exams dates released
తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TGCHE) 2026 సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్టుల (TG CETs) షెడ్యూల్‌ను మంగళవారం విడుదల చేసింది.
ఈ షెడ్యూల్‌ను TGCHE చైర్మన్ ప్రొ. వి. బాలకిష్టా రెడ్డి మరియు సెక్రటరీ ప్రొ. శ్రీరామ్ వెంకటేశ్ విడుదల చేశారు.
దరఖాస్తు అర్హతలు, రిజిస్ట్రేషన్ ఫీజు, పూర్తి నోటిఫికేషన్ వివరాలు సంబంధిత CET కన్వీనర్లు త్వరలో ప్రకటించనున్నారని TGCHE సెక్రటరీ తెలిపారు.
TG EAPCET – 2026 : ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా, హర్టీకల్చర్, వెటర్నరీ, ఫార్మా డీ వంటి కోర్సుల్లో ప్రవేశాలు
- అగ్రికల్చర్ & ఫార్మసీ కోర్సులు : మే – 4, 5
- ఇంజినీరింగ్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు : మే 9 నుండి 11 వరకు
EdCET – 2026 : రెండేళ్ల B.Ed కోర్సుల ప్రవేశానికి
- పరీక్ష తేదీ: మే 12
ICET – 2026 : MBA & MCA కోర్సుల ప్రవేశాలకు
- పరీక్ష తేదీలు: మే 13 & 14
ECET – 2026 : డిప్లొమా & B.Sc (గణితం) ఉత్తీర్ణులకు ఇంజినీరింగ్ & ఫార్మసీ ద్వితీయ సంవత్సరం లాటరల్ ఎంట్రీకి
- పరీక్ష తేదీ: మే 15
LAWCET & PGLCET – 2026 : న్యాయ విద్య కోర్సుల ప్రవేశాలకు
- పరీక్ష తేదీ: మే 18
PGCET – 2026 : పీజీ ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశాలకు
- పరీక్షలు: మే 28 నుండి 31 వరకు
PECET – 2026 : ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సుల ప్రవేశాలకు
- పరీక్షలు: మే 31 నుండి జూన్ 3 వరకు
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
