BIKKI NEWS : Today in history – చరిత్రలో ఈరోజు డిసెంబర్ 23
Today in history December 23rd
దినోత్సవం
- జాతీయ రైతు దినోత్సవం
- ఈజిప్టు విజయోత్సవ దినం. ( సూయజ్ కెనాల్ వివాదానికి తెరపడింది
సంఘటనలు
1912: రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చే సందర్భంగా జరిగిన సంబరాలలో వైస్రాయి లార్డ్ హర్డింగ్ పై జరిగిన హత్యాప్రయత్నం ఢిల్లీ-లాహోర్ కుట్రగా చరిత్రకెక్కింది
1920: ‘హైదరాబాదు కంపెనీస్ ఛట్టం ప్రకారం, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ‘ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్.సి.సి.ఎల్) ‘ అనే పేరుతో ఏర్పడింది. హైదరాబాదు (డెక్కన్) కంపెనీ లిమిటెడ్ కి చెందిన సమస్త హక్కులను (అప్పులు, ఆస్తులు) మొందింది. కాలక్రమంలో, 1956 కంపెనీస్ చట్టం ప్రకారం, ప్రభుత్వ సంస్థగా అవతరించింది.
జననాలు
1725: అహమ్మద్ షా బహదూర్, 13 వ మొఘల్ చక్రవర్తి. (మ.1775)
1881: బలిజేపల్లి లక్ష్మీకాంతం, స్వాతంత్ర్య సమరయోధులు, అవధాని, నాటక రచయిత, రంగస్థల, సినిమా నటులు. (మ.1953)
1889: మెహర్ చంద్ మహాజన్, భారతదేశ మూడవ ప్రధాన న్యాయమూర్తి (మ. 1967)
1891: వీరమాచనేని ఆంజనేయ చౌదరి, స్వసంఘ పౌరోహిత్యానికి మూలపురుషుడు. (మ.1988)
1902: చరణ్ సింగ్, భారత దేశ 5వ ప్రధానమంత్రి. (మ.1987)
1922: ఘండికోట బ్రహ్మాజీరావు, ఉత్తరాంధ్ర రచయిత, సాహితీ వేత్త. (మ.2012)
1933: శిరోమణి సహవాసి, ఈనాడు దినపత్రికలో ఉద్యోగిగా చేరాడు. 1984లో సహాయక వార్తా సంపాదకునిగా పనిచేశాడు.
1936: ఆదేశ్వరరావు, సమకాలీన హిందీ రచయిత.
1936: కప్పగంతుల మల్లికార్జునరావు, కథా, నవలా, నాటక రచయిత. (మ.2006)
1940: ముదిగొండ శివప్రసాద్, చారిత్రక నవలా రచయిత.
1966: చెరుకూరి సుమన్, బుల్లితెర రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, చిత్రలేఖకుడిగా, ఉషాపరిణయం చిత్ర నటుడిగా తెలుగువారికి సుపరిచితుడు. (మ.2012)
1987: ఆది: తెలుగు నటుడు, క్రికెట్ ఆటగాడు.
మరణాలు
1987: ఈమని శంకరశాస్త్రి, వైణికుడు. (జ.1922)
1997: గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి, పండితులు. (జ.1913)
2004: పి.వి.నరసింహారావు, పూర్వ భారత ప్రధానమంత్రి. (జ.1921)
2011: త్రిపురనేని మహారధి, సినీ మాటల రచయిత (జ.1930)
2014: కైలాసం బాలచందర్, దక్షిణ భారత చలన చిత్ర దర్శకుడు, రచయిత, నిర్మాత, (జ.1930)
2020: బాతిక్ బాలయ్య, తెలంగాణకు చెందిన బాతిక్ చిత్రకారుడు. (జ. 1939)
2022: కైకాల సత్యనారాయణ, సినిమా నటుడు. మాజీ పార్లమెంటు సభ్యుడు. (జ.1935)

