ఇంటర్ బోర్డును సందర్శించిన సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి

ఇంటర్ బోర్డును సందర్శించిన సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి - bikki news

BIKKI NEWS (NOV. 21) : CM SPECIAL SECRETARY AJITH REDDY VISITED INTER BOARD. ముఖ్యమంత్రివర్యుల స్పెషల్ సెక్రటరీ శ్రీ అజిత్ రెడ్డి గారు, తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి (TGBIE) కార్యాలయాన్ని సందర్శించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అమలులో ఉన్న విద్యా కార్యక్రమాలు, విద్యార్థి కేంద్రిత చర్యలను ఈ సందర్భంగా ఆయన సమీక్షించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించి, రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సిసిటీవీ నిఘా వ్యవస్థ పనితీరును సమీక్షించారు.

CM SPECIAL SECRETARY AJITH REDDY VISITED INTER BOARD.

ఈ సందర్భంలో 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలలను పర్యవేక్షించి, విద్యార్ధుల హాజరు, విద్యా పురోగతి వంటి అంశాలపై అధికారులతో శ్రీ అజిత్ రెడ్డి చర్చించారు. విద్యార్థులు, సిబ్బంది హాజరును రియల్ టైమ్ లో నమోదు చేసే ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) ను సమర్థంగా అమలు చేస్తున్నందుకు ఆయన ప్రశంసించారు. ఈ వ్యవస్థ ద్వారా హాజరు శాతం పెరగడంతో పాటు సిబ్బంది వినియోగం, కళాశాలల నిర్వహణలో పారదర్శకత మెరుగుపడిందని తెలిపారు. అలాగే సిసిటీవీ నిఘా విద్యార్థుల భద్రత, క్రమశిక్షణ, విద్యా వాతావరణాన్ని బలోపేతం చేస్తున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు.

ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (IVRS) ను కూడా సమీక్షించి, విద్యార్ధుల ఫిర్యాదులకు త్వరితగతిన స్పందిస్తున్న తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

ఉద్యోగుల సెలవుల నిర్వహణ, సేవా సంబంధిత కార్యాచరణలను సులభతరం చేస్తున్న హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ (HRMS) పోర్టల్ అమలును కూడా ఆయన అభినందించారు. ఈ పోర్టల్ వల్ల మానవ జోక్యం తగ్గి, ప్రక్రియలు వేగవంతం అవడంతో పాటు సిబ్బంది పరిపాలనలో పారదర్శకత పెరిగిందని పేర్కొన్నారు.

2026 ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల (IPE) నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆయన సంబంధిత అధికారులకు సూచించారు.

టీజీబీఐఇ కార్యదర్శి శ్రీ కృష్ణ ఆదిత్య, IAS విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం ఇంటర్ విద్యా శాఖ పలు చర్యలను చేపట్టిందని తెలిపారు. అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సీసీటీవీ నిఘా, ఫేషియల్ రికగ్నిషన్ ఆధారిత హాజరు వ్యవస్థలను అమలు చేయడంతో హాజరు శాతం పెరిగి, సిబ్బంది పర్యవేక్షణ సులభతరం చేసిందని వివరించారు. ఉద్యోగుల సెలవులు, సేవా రికార్డులు వంటి అంశాలను నిర్వహించడానికి HRMS పోర్టల్ ఉపయోగపడుతోందని తెలిపారు.

ప్రతి నెల మూడు రోజులపాటు టీజీబీఐఐ ప్రత్యేకాధికారులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలను సందర్శించి హాజరు, స్టడీ అవర్స్, బోధనా విధానాలు, మౌలిక వసతులను పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ పర్యవేక్షణ వల్ల కళాశాలల్లో అవసరమైన మౌలిక వసతులను సమయానుకూలంగా గుర్తించి తగిన చర్యలు తీసుకునే అవకాశం లభిస్తున్నట్లు తెలిపారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →