494 జూనియర్ లెక్చరర్స్ పోస్టుల మంజూరుకు ప్రతిపాదనలు

BIKKI NEWS (SEP. 22) : 494 junior lecturers posts need to sanction. తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొత్తం 494 జూనియర్ లెక్చరర్స్ పోస్టులను మంజూరు చేయాలని ఇంటర్ విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది.

494 junior lecturers posts need to sanction.

అయితే ఇప్పటికే 349 పోస్టుల మంజూరుకు సూత్రప్రాయంగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మరో 145 పోస్టులను కూడా కలుపుకుని మొత్తం 494. పోస్టుల మంజూరు చేయించుకోవడం కోసం ఇంటర్ బోర్డు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

అయితే ఈ పోస్టుల వివరాలు ప్రభుత్వ ఉద్యోగుల హేతుబద్దీకరణపై నియమించిన శాంతికుమారి కమిటీ పరిశీలనకు పంపారు. కమిటీ ఆమోదం తెలిపితే ప్రభుత్వం జీవోలు జారీ చేస్తుందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. వాటిలో 18 బీఆరెస్ ప్రభుత్వ హయాంలో మంజూరయ్యాయి. వాటికి 239 అధ్యాపక పోస్టులు అవసరం కాగా.. కాంగ్రెస్ ప్రభుత్వం మరో 7 కళాశాలలను మంజూరు చేసింది. 110 అధ్యాపక పోస్టులు అవసరం. ఈ 349 పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లయింది.

అలాగే మిగిలిన పాత కళాశాలల్లో మరో 145 అధ్యాపక ఖాళీలున్నాయి. వాటిని కూడా కలిపితే మొత్తం 494 అధ్యాపకులు అవసరం.