Supreme court – ఉన్నత విద్యా సంస్థలలో కులవివక్ష

BIKKI NEWS (SEP. 16) : Cast feeling in higher educational institutions. దేశంలోని ఉన్నత విద్యా సంస్థలలో కుల వివక్షతో కూడిన వేధింపులను నివారించడానికి, నిర్మూలనకు నూతన నిబంధనలను 2 నెలల్లోగా రూపొందించాలని యూజీసీ ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Cast feeling in higher educational institution

కులవివక్ష కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ వేముల, పాయల్ తాడ్వి మాతృమూర్తులు
దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మల్యా బాగ్చి ధర్మాసనం ఈ ఉత్తర్వులిచ్చింది.

యూజీసీ ఇప్పటికే ముసాయిదా నిబంధనలు రూపొందించిందని, దానిపై పలు సూచనలు అందాయని, నిపుణుల కమిటీ పరిశీలిన చేస్తోందని కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.