BIKKI NEWS (MAR. 11) : Free EV Scooties for Telangana students. తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ, బీటెక్ మరియు ఇతర కోర్సులు చేస్తున్న అమ్మాయిలకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీలను పంపిణీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది.
Free EV Scooties for Telangana students.
దాదాపు 1,70,000 విద్యార్థినిలకు ఎలక్ట్రిక్ స్కూటీలు పంపిణీ చేయడానికి 1,600 కోట్ల రూపాయలు అవసరమవుతాయని ప్రాథమిక అంచనా వేయడం జరిగింది.
మార్చి 16 నుండి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలలో నిధులను ఈ పథకం కోసం కేటాయించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
Also Read…
• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్
వచ్చే విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులకు ఈ ఉచిత ఎలక్ట్రిక్ స్కూటీలను పంపిణీ చేసేందుకు కసరత్తు చేయనున్నారు. ముందుగా డిగ్రీ, బి.టెక్ విద్యార్థినిలకు స్కూటీలు పంపిణీ చేసి తరువాత మిగిలిన కోర్సులు చదువుతున్న విద్యార్థినిలకు కూడా దశలవారీగా ఉచిత స్కూటీలను పంపిణీ చేయనున్నారు.
విద్యార్థినిలు ప్రతిరోజు కళాశాలకు వెళ్లేందుకు పెట్రోల్ భారం లేకుండా అలాగే పర్యావరణ అనుకూలమైన ఎలక్ట్రిక్ స్కూటీలను పంపిణీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
- Today in history November 15th – చరిత్రలో ఈరోజు నవంబర్ 15
- GK BITS Question Bank By Bikki News – వివిధ సబ్జెక్టుల స్టాండర్డ్ జీకే బిట్స్ ప్రశ్నల నిధి
- India won U19 Asia Cup 2026 – పాకిస్తాన్ పై యంగ్ ఇండియా సంచలన విజయం
- Free skill training at SRTRI – భూదాన్‌పోచంపల్లిలో ఉచిత నైపుణ్య శిక్షణ
- Today Gold Rate 14th November 2026 – ఈరోజు బంగారం, వెండి, ప్లాటినం ధరలు

