BIKKI NEWS (Nov 26) : Forum for Telangana letter to CM on inter merger. తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను పాఠశాల విద్యలో విలీనం చేయాలన్న ప్రతిపాదనను, నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, ఫోరమ్ ఫర్ తెలంగాణ కన్వీనర్ ఆచార్య జగదీశ్వర్రావు వీరనేని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారిక లేఖ రాశారు.
Forum for Telangana letter to CM on inter merger
ఇంటర్ కళాశాలల్లో 9, 10 తరగతుల నిర్వహణకు అనుమతులు ఇస్తే స్థానిక విద్యార్థుల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని ఆయన తన లేఖలో స్పష్టం చేశారు:
ఇవి చదివారా :
స్థానిక కోటాలో (MBBS, BDS) తీవ్ర నష్టం: తెలంగాణలో ఎంబీబీఎస్ (MBBS), బీడీఎస్ (BDS) తదితర మెడికల్ కోర్సుల్లో స్థానిక కోటా కింద సీట్లు పొందాలంటే 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు వరుసగా నాలుగేళ్లు తెలంగాణలోనే చదివి ఉండాలన్న నిబంధన, సుప్రీంకోర్టు తీర్పు ఉంది.
ఇతర రాష్ట్రాల విద్యార్థులకు అవకాశం: ఒకవేళ ఇంటర్మీడియట్ కళాశాలల్లో 9, 10 తరగతుల బోధనకు అనుమతి ఇస్తే, ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఇక్కడికి వచ్చి తొమ్మిదో తరగతి నుంచి వరుసగా నాలుగేళ్లు చదివి స్థానిక కోటాలో సీట్లు పొందే అవకాశం ఏర్పడుతుంది. ఫలితంగా తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు తమకు దక్కాల్సిన స్థానిక సీట్లను కోల్పోయి తీవ్రంగా నష్టపోతారు.
కార్పొరేట్ కళాశాలలకే ప్రయోజనం: 9 నుండి 12వ తరగతి వరకు ఒకేచోట అనుమతులు ఇవ్వడం వల్ల కేవలం కార్పొరేట్ విద్యాసంస్థలకే మేలు జరుగుతుందని, కాబట్టి ప్రభుత్వం ఈ విలీన నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని ఆచార్య జగదీశ్వర్రావు కోరారు.

