TODAY IN HISTORY – చరిత్రలో ఈరోజు ఆగస్టు 30

Today in history - చరిత్రలో ఈరోజు ఆగస్టు 30 - bikki news

BIKKI NEWS: TODAY IN HISTORY – చరిత్రలో ఈరోజు ఆగస్టు 30

TODAY IN HISTORY AUGUST 30th

దినోత్సవం

  • అంతర్జాతీయ తప్పిపోయిన వారి దినోత్సవము.
  • సెయింట్ రోజ్ ఆఫ్ లీమా దినోత్సవము (పెరూ దేశములో).
  • విజయ దినము (టర్కీ దేశములో).
  • చిన్న పరిశ్రమల దినోత్సవం

సంఘటనలు.

1574 – గురు రామ్ దాస్ నాలుగవ సిక్కు గురువు అయ్యాడు.
1791 – హెచ్.ఎమ్.ఎస్ పండోరా అనే నౌక ములిగిపోయింది.
1800 – వర్జీనియాలోని రిచ్ మండ్ దగ్గర బానిసల తిరుగుబాటుకి గేబ్రియల్ ప్రోస్సెర్ నాయకత్వం వహించాడు.
1813 – కుల్మ్ యుద్ధము: ఆస్ట్రియా, ప్రష్యా, రష్యాల కూటమి ఫ్రెంచి సైన్యాలను ఓడించాయి.
1813: క్రీక్ యుద్దము.
1835: ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరాన్ని స్థాపించారు.
1836: ఆగస్టస్ చాప్‌మాన్ అల్లెన్, జాన్ కిర్బీ అల్లెన్ హౌస్టన్ అనే ఇద్దరు హౌస్టన్ నగరాన్ని స్థాపించారు. హౌస్టన్, అమెరికాలోని నాలుగవ పెద్ద నగరం. టెక్సాస్ రాష్ట్రంలోని అతి పెద్ద నగరం.
1862: అమెరికన్ అంతర్యుద్ధము : రిచ్‌మండ్ యుద్ధము :
1862: అమెరికన్ అంతర్యుద్ధము : రెండవ బుల్ రన్ యుద్ధములో యూనియన్ సైన్యము ఓడిపోయింది.
1873: ఆర్కిటిక్ సముద్రంలో ఉన్న ఫ్రాంజ్ జోసెఫ్ లేండ్ అనే అర్చిపెలాగోని ఆస్ట్రియాకు చెందిన సాహసికులు (యాత్రికులు) జూలియస్ వాన్ పేయర్, కార్ల్ వీప్రెచ్ కనిపెట్టారు.
1897: మడగాస్కర్ లో ఉన్న అంబికీ అనే పట్టణాన్ని, మెనాబే నుంచి ఫ్రెంచి వారు గెలిచారు.
1896: ఫిలిప్పైన్స్ లోని ఎనిమిది రాష్టాలలో స్పానిష్ గవర్నర్ జనరల్ రామన్ బ్లాంకో మార్షల్ లా (సైనిక పాలన) విధించాడు. ఆ రాష్ట్రాలు మనిలా, కవిటె, బులాకన్, పంపంగ, నువే ఎకిజా, బతాన్, లగున, బతంగస్.


1909: బర్గెస్ షేల్ ఫాసిల్స్ (శిలాజాలు) ని ఛార్లెస్ డూలిటిల్ కనిపెట్టాడు. ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఈ శిలాజాలు బ్రిటిష్ కొలంబియాలో ఉన్నాయి. ఇవి 505 మిలియన్ (50 కోట్ల 50 లక్షలు) సంవత్సరాల నాటి మధ్య కేంబ్రియన్ యుగానికి చెందినవి.
1914: తన్నెన్‌బెర్గ్ యుద్ధము. మొదటి ప్రపంచ యుద్ధము మొదటి రోజులలో జర్మన్ సామ్రాజ్యానికి, రష్యన్ సామ్రాజ్యానికి 1914 ఆగష్టు 23 నుంచి 1914 ఆగష్టు 30 వరకు జరిగిన యుద్ధము.
1922: గ్రీకులకు, టర్కీ వారికి జరిగిన అంతిమ యుద్ద్యమును దుమ్లుపినార్ యుద్ధము (1919 నుంచి 1922 వరకు)అని (టర్కీ దేశీయుల స్వాతంత్ర్య యుద్ధము )అని కూడా అంటారు.
1941: రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జరిగిన రెండు సంవత్సరాలు లెనిన్‌గ్రాడ్ ముట్టడి మొదలైంది.
1942: రెండవ ప్రపంచ యుద్ధము : ఆలం హాల్ఫా యుద్ధము మొదలైంది.
1945: బ్రిటిష్ సైన్యం జపాన్ నుంచి హాంగ్ కాంగ్ ని విడిపించింది.
1945: జనరల్ డగ్లస్ మెక్ ఆర్ధర్, మిత్ర సైన్యాల సుప్రీం కమాండర్ అత్సుగి ఏర్ ఫోర్స్ బేస్ లో దిగాడు.
1963: అమెరికా అధ్యక్షుడు (శ్వేత సౌధము), రష్యా అధ్యక్షుడు (క్రెమ్లిన్) మధ్య హాట్‌లైన్ (టెలిఫోన్ సర్వీసు) ప్రారంభమైంది. ఎందుకంటే, అనుకోకుండా, రెండు దేశాల మధ్య ప్రమాదవశాత్తు యుద్ధం జరిగితే ఆపటానికి.
1967: అమెరికా సుప్రీం కోర్టుకు మొట్టమొదటి ఆఫ్రికన్ అమెరికన్ న్యాయాధిపతిగా థర్‌గుడ్ మార్షల్ ని నియమించారు.


1974: బెల్‌గ్రేడ్ నుంచి డోర్ట్‌మండ్ వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలు ‘జాగ్రెబ్’ అనే పెద్ద రైల్వే స్టేషను దగ్గర పట్టాలు తప్పింది. 153 మంది ప్రయాణీకులు మరణించారు.
1974: టోక్యో లోని మరునౌచి దగ్గర ఉన్న ‘మిట్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ హెడ్‌క్వార్టర్స్ ‘ దగ్గర శక్తివంతమైన బాంబు పేలింది. ఎనిమిది మంది మరణించారు. 378 మంది గాయపడ్డారు. 1975 మే 19 తేదిని, ఎనిమిదిమంది లెఫ్ట్ వింగ్ సభ్యులను జపాన్ అధికారులు అరెస్ట్ చేసారు.
1980: పోలిష్ కార్మికులు కార్మిక సంఘపు హక్కులను సంపాదించుకున్నారు. సమ్మె చేస్తున్న పోలిష్ కార్మికులు కమ్యూనిష్ఠు పాలకులతో తలపడి, విజయం సాధించారు. ఫలితంగా, వారికి స్వతంత్ర కార్మిక సంఘాలను ఏర్పరచటానికి, సమ్మెచేసే హక్కు లభించాయి.
1982: పాలెస్తీనా లిబరేషన్ సంస్థ (పి.ఎల్.ఒ) నాయకుడు దశాబ్దం పైగా ఉంటున్న బీరూట్ కేంద్రాన్ని వదిలి వెళ్ళిపోయాడు.
1984: అమెరికా రోదసీ నౌక ఎస్.టి.ఎస్-41-డి డిస్కవరీ స్పేస్ షటిల్ తన మొదటి ప్రయాణాన్ని మొదలు పెట్టి రోదసీలోనికి వెళ్ళింది.
1995: బోస్నియన్ సెర్బ్ సైన్యాన్ని ఎదుర్కోవటానికి నాటో ‘ఆపరేషన్ డెలిబెరేట్ ఫోర్స్’ని అమలు చేసింది.
1999: ఐక్యరాజ్య సమితి అజమాయిషీలో ఏర్పాటు చేసిన ఎన్నికలలో తూర్పు తైమూర్ ప్రజలు ఇండోనీషియా నుంచి స్వతంత్రము కోరుతూ ఓటు వేసారు.


2001: యుగోస్లావియా మాజీ అధ్యక్షుడు స్లొబొదాన్ మిలోసెవిక్ ప్రజలను మూకుమ్మడిగా హత్య చేసినట్లు (యుద్దనేరాలలో అత్యంత ఘోరమైన నేరం) ఆరోపణ జరిగింది.
2005: హరికేన్ కత్రినా, అమెరికాలోని న్యూ ఆర్లియెన్స్ ని తాకిన మరునాడు, 80 శాతము ‘న్యూ ఆర్లియెన్స్’ వరద నీటిలో ములిగిపోయింది. చాలామంది ప్రజలను హెలికాప్టర్లు / పడవల ద్వారా రక్షించి, సురక్షిత ప్రాంతానికి చేర్చారు.
2010: డైరెక్ట్ టాక్సెస్ కోడ్ 2010ని లోక్ సభలో ప్రవేశపెట్టారు.

జననాలు

1797: మేరీ వోల్‌స్టోన్‌క్రాఫ్ట్ షెల్లీ, ఫ్రాంకెన్‌స్టీన్ నవలా రచయిత్రి (మ.1851).
1871: ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్, న్యూజీలాండ్ కు చెందిన ఒక రసాయనిక శాస్త్రజ్ఞుడు. (మ.1937)
1912: వెల్లాల ఉమామహేశ్వరరావు, తెలుగు సినిమా తొలితరం కథానాయకుడు.
1913: రిచర్డ్ స్టోన్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
1934: బాలూ గుప్తె, భారతీయ క్రికెట్ ఆటగాడు. (మ.2005)
1936: జమున, సినిమా నటి (మ. 2023)
1949: మమ్మెన్ చాండీ, భారతదేశంలో ఎముక మజ్జ మార్పిడి (బోన్ మారో ట్రాన్స్‌ప్లాంటేషన్) రంగంలో నిష్ణాతుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత.
1958: పరిటాల రవి, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు. (మ.2005)
1959: నాగబాల సురేష్ కుమార్, రచయిత, దర్శకుడు, నటుడు, నిర్మాత.
1963: ఆనంద్ బాబు, తమిళ, తెలుగు, హిందీ, చిత్రాల నటుడు.(హాస్యనటుడు నగేష్ కొడుకు)
1983: మాధవి. ఒ, తెలుగు రంగస్థల నటి, గాయని.
1980: రిచా పల్లాడ్, తెలుగు, హిందీ నటి.
1994: నందితా రాజ్: తెలుగు చలన చిత్ర నటి .

మరణాలు

30 బి.సి.: క్లియోపాత్ర ఉచ్చారణ తేడా క్లియోపాట్ర VII, ఈజిప్ట్ మహారాణి, గొప్ప అందగత్తె, ఆత్మహత్య చేసుకున్నది.
1949: తల్లాప్రగడ విశ్వసుందరమ్మ, స్వాతంత్ర్య సమరయోధురాలు, తెలుగు రచయిత్రి. (జ.1899)
1963: రూపనగుడి నారాయణరావు, సాహితీశిల్పి, నాటకకర్త. (జ.1885)
2008: కృష్ణ కుమార్ బిర్లా, పారిశ్రామికవేత్త, బిర్లా గ్రూపుల అధినేత. (జ.1918)
2013: సీమస్ హీనీ, ఐరిష్ కవి, నాటక రచయిత, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1939)
2022: మిఖాయిల్ గోర్బచేవ్, చివరి సోవియట్ యూనియన్ నాయకుడు. (జ.1931)

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →