Today in history – చరిత్రలో ఈరోజు ఆగస్టు 28

Today in history - చరిత్రలో ఈరోజు ఆగస్టు 28 - bikki news

BIKKI NEWS : Today in history – చరిత్రలో ఈరోజు ఆగస్టు 28

Today in history August 28th

సంఘటనలు

1709: మీడింగు పంహెబా మణిపూర్ రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు.
2000: హైదరాబాద్ బషీర్ బాగ్ లో విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా వామపక్ష పార్టీలు చలో అసెంబ్లీకి పిలుపునిస్తూ వేయిలాది మందితో నిరసన చేయగా ఆ ఆందోళనలో పోలీసులు కాల్పులు జరుపగా రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి లు మరణించారు, అనేక మంది గాయపడ్డారు.
2017: ఆగష్టు 28 న భారత సుప్రీం కోర్టు 45వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ దీపక్‌ మిశ్రా బాధ్యతలు స్వీకరించారు.

జననాలు

1749: గేథే, జర్మనీ రచయిత. (మ.1832)
1904: దాట్ల సత్యనారాయణ రాజు, స్వతంత్ర సమరయోధుడు, భారత పార్లమెంట్ సభ్యుడు.
1928: విలాయత్ ఖాన్, భారతీయ సితార్ వాదకుడు. (మ. 2004)
1928: ఆర్.బాల సరస్వతి , తెలుగు చలనచిత్ర నటి , నేపథ్య గాయని .
1934: ఎ.పి. కోమల, తెలుగు, తమిళం, మలయాళ గాయని. రేడియో కళాకారిణి.
1949: డబ్బింగ్ జానకి, దక్షిణభారత చలన చిత్ర నటి.
1959: సుమన్, తెలుగు సినిమా నటుడు.
1964: నళిని , దక్షిణ భారత చలన చిత్ర నటి.
1967: ఫాదర్ రవి శేఖర్, కళాదర్శిని డైరెక్టరు అయిన ఫా. జో సేబాస్టియన్, ఎస్.జె. గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసారు
1969 : ఒక అమెరికన్ సాంకేతిక అధికారి, ఉద్యమకర్త, రచయిత షెరిల్ శాండ్‌బర్గ్
1976: కుసుమ జగదీశ్, తెలంగాణ ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు (మ. 2023)
1993 : బ్రిటిష్ పాప్ గాయని చెర్ల లాయిడ్

మరణాలు

1958: భమిడిపాటి కామేశ్వరరావు, రచయిత, నటుడు, నాటక కర్త. (జ.1897)
1988: చీకటి పరశురామనాయుడు, రాజకీయ నాయకుడు. (జ.1910)
2006: డి.వి.నరసరాజు, రంగస్థల, సినిమా నటుడు, రచయిత, దర్శకుడు. (జ.1920)
2015: బి.సత్యనారాయణ, తెలుగు సినిమా నిర్మాత.
2017: నరేంద్ర కుమార్, భారతీయ భౌతిక శాస్త్రవేత్త, శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం, పద్మశ్రీ పురస్కారాల గ్రహీత. (జ.1940)

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →