BIKKI NEWS (SEP. 23) : Rain Holidays Bharadi kothagudem district. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాగల రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ (CPO) హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ 23, 24 తేదీల్లో జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Rain Holidays Bharadi kothagudem district.
తల్లిదండ్రులు, విద్యార్థులకు కీలక సూచనలు
భారీ వర్షాల దృష్ట్యా ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు మండల విద్యాశాఖ అధికారులు (MEOs), ఉపాధ్యాయులు విద్యార్థులకు, తల్లిదండ్రులకు తగిన అవగాహన కల్పించాలని ఆదేశించారు. ముఖ్యంగా:
- వర్షపు నీటితో నిండిన గుంతలు, లోతట్టు ప్రాంతాల వైపు వెళ్లకూడదు.
- చెరువులు, కుంటలు, వాగులు మరియు ఇతర జలాశయాల వద్దకు విద్యార్థులు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి.
- అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.

