BIKKI NEWS (SEP. 22) : Telangana Employees JAC with CS postponed. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఈరోజు సాయంత్రం 6 గంటలకు జరగాల్సిన TGEJAC సమావేశం రేపు (సెప్టెంబర్ 23) మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది.
Telangana Employees JAC with CS postponed.
JAC నిర్ణయించిన 4 ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జాజు నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తో చర్చించడం జరిగింది.
అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రేపు మధ్యాహ్నం 2 గంటలకు JAC ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం..
అలాగే, 4 ప్రధాన డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమికంగా సమాచారం. ఈ అంశాలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను రేపటి సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

