BIKKI NEWS (SEP. 22) : Telangana employees JAC ready to protest from October 2nd. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నిన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తో జరిపిన చర్చలలో ముఖ్యంగా నాలుగు డిమాండ్ లను పేర్కొంది. ఒకవేళ వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే అక్టోబర్ 2 నుంచి నిరవధిక దీక్షలు చేపట్టాలని 206 సంఘాలతో కూడిన జేఏసీ నిర్ణయించింది.
Telangana employees JAC ready to protest from October 2nd
జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన చర్చల్లో పేర్కొన్న డిమాండ్ లు
2వ పీఆర్సీ నివేదిక ను 30వ తేదీ లోపల తెప్పించుకొని 51% ఫిట్ మెంట్ తో ప్రకటించడం.
పెండింగ్ లో ఉన్న 5 డీఏ లను వెంటనే అమలు చేయడం
పెండింగ్ బిల్లుల కొరకు నెలకు 2000 కోట్ల రూపాయలను విడుదల చేసి 50 -50 శాతాల చొప్పున రిటైర్మెంట్ అయిన, పని చేస్తున్న ఉద్యోగుల బిల్లులు చెల్లించడం.
నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడం.
అయితే సోమవారం జరిగిన చర్చలు అసంపూర్తిగా మిగలడం తో నేడు సాయంత్రం 6 గంటలకు మరోసారి భేటీ అవ్వాలని నిర్ణయం.

