BIKKI NEWS (Sep. 09) : Orders issued to submit the Telangana PRC report by CS. తెలంగాణ రెండో పీ ఆర్ సి నివేదికను వెంటనే సమర్పించాలని శివశంకర్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.
Orders issued to submit the Telangana PRC report by CS
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడి సెప్టెంబర్ 10 నుండి చలో హైదరాబాద్ కార్యక్రమంతో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో భట్టి విక్రమార్కతో జరిగిన చర్చలు కూడా సఫలం కాకపోవడం, మరోవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు వెనకడుగు వేయకపోవడంతో ప్రభుత్వం పిఆర్సి కమిటీ నుండి నివేదికను కోరుతూ ఆదేశాలు జారీ చేసింది.
పిఆర్సి కమిటీ ప్రతిపాదించే ఫిట్మెంట్ పై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపి తదనంతరం ఫైనల్ ఫిట్ మెంట్ ను ప్రకటించి పిఆర్సి నివేదికను విడుదల చేసే అవకాశాలు ఉంటాయి.
