BIKKI NEWS (Sep. 07) : postal GDS Jobs notification with 23757 posts. భారతీయ పోస్టల్ డిపార్ట్మెంట్ 2026 రెండో సెషన్ కు సంబంధించి 23,757 గ్రామీణ్ డాక్ సేవక్, ఏజీపీఎం , జీపీఎం వంటి పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
postal GDS Jobs notification with 23757 posts
అర్హతలు : పదో తరగతి లో వచ్చిన మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఎంపిక ప్రక్రియ పూర్తిగా 10వ తరగతి మార్కుల మెరిట్ ఆధారితంగా ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష మరియు ఇంటర్వూ ఉండదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 917, తెలంగాణ రాష్ట్రంలో 419 పోస్టులు కలవు.
పోస్టుల వివరాలు :
- గ్రామీణ్ డాక్ సేవక్
- బ్రాంచ్ పోస్ట్ మాస్టర్
- అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్
వయోపరిమితి : సెప్టెంబర్ 21 నాటికి 18 – 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
కావాల్సిన సర్టిఫికెట్ లు : GDS ఎంపిక పూర్తిగా 10వ తరగతి మార్కులపై ఆధారపడుతుంది కాబట్టి, ఈ డాక్యుమెంట్లు ముందే సిద్ధంగా ఉంచుకోండి:
- 10వ తరగతి మార్క్ షీట్ / సర్టిఫికెట్
- కుల ధృవీకరణ పత్రం (అవసరమైతే)
- ఆధార్ కార్డు
- తాజా ఫోటో & సంతకం (డిజిటల్ ఫార్మాట్)
- చెల్లుబాటు అయ్యే మొబైల్ నంబర్ & ఈమెయిల్ ID
దరఖాస్తు గడువు : ఆన్లైన్ ద్వారా 2026 సెప్టెంబర్ 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎడిట్ ఆప్షన్ : 2026 సెప్టెంబర్ 23, 24వ తేదీలలో దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ అవకాశం ఉంది.
ఎంపిక జాబితా విడుదల : 2026 డిసెంబర్ 31 న ఎంపికైన అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేయనున్నారు.
వెబ్సైట్ : https://www.indiapost.gov.in/gdsonlineengagement
