BIKKI NEWS (August 02) : Intermediate and school education boards merger as TGSEB. తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్యను విలీనం చేసి తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు పరిధిలోకి తేవాలనే ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది. అలాగే పాలిటెక్నిక్ విద్యను నియంత్రిస్తున్న SBTET ను రద్దుచేసి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడానికి కూడా చర్యలు వేగవంతం చేశారు.
Intermediate and school education boards merger as TGSEB
ఒకటో తరగతి నుండి 12వ తరగతి వరకు విద్యను ఒకే గొడుగు కింద ఉంచేలా తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డు ఏర్పాటు చేయాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అందుకు సంబంధించిన ముసాయిదా బిల్లులను న్యాయ సలహా కోసం పంపినట్లు సమాచారం.
తెలంగాణ ఇంటర్ బోర్డు అటానమస్ గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డు అటానమస్ గా ఉంచాలా, ప్రభుత్వానికి అనుబంధంగా ఉంచాలా అనే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు.
అలాగే పాలిటెక్నిక్ విద్యను కూడా ప్రత్యేక బోర్డు నుండి తొలగించి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావాలని చర్యలు కూడా వేగవంతమయ్యాయి.
ఈ రెండు బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదం తీసుకొని 2027- 28 విద్యా సంవత్సరంలో అమలు చేయడానికి ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తుంది
