BIKKI NEWS (APRIL 24) : INTEGRATED PG WITH DOST NOTIFICATION 2026. తెలంగాణ రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల పరిధిలో 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలను దోస్త్ నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేయాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది.
INTEGRATED PG WITH DOST NOTIFICATION 2026
ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల లో అడ్మిషన్ల కోసం దోస్త్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంతకుముందు ఈ ఇంటిగ్రేటెడ్ పీజీ సీట్లను సిపి గెట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసేవారు. తాజాగా వీటిని దోస్త్ ద్వారానే భర్తీ చేయాలని ఉన్నత విద్య మండలి నిర్ణయం తీసుకుంది.
ఇంతకుముందు ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేసిన ఈ సీట్లను ప్రస్తుతం ఇంటర్మీడియట్ మార్కుల మెరిట్ ఆధారంగా భర్తీ చేయనున్నారు.
కోర్సుల వివరాలు :
- MBA – (మహాత్మా గాంధీ, తెలంగాణ యూనివర్సిటీలు)
- MSc CHEMISTRY – (కాకతీయ, పాలమూరు యూనివర్సిటీలు)
- MSc Bio Technology (కాకతీయ యూనివర్సిటీ)
- MSc PHARMACEUTICAL CHEMISTRY – (మహాత్మా గాంధీ, తెలంగాణ యూనివర్సిటీలు)
- MA APPLIED ECONOMICS – (తెలంగాణ యూనివర్సిటీ)
కింద ఇవ్వబడిన దోస్త్ నోటిఫికేషన్ లింకు ద్వారా విద్యార్థులు నేరుగా ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి పరీక్ష లేకుండా కేవలం ఇంటర్మీడియట్ మార్కుల మెరిట్ ఆధారంగానే సీట్లను కేటాయించనున్నారు. ఇది ఇంటర్మీడియట్ విద్యార్థులకు సువర్ణ అవకాశం.
FAQ :
Telangana Integrated PG seats application link.?
A : THROUGH DOST 2026 NOTIFICATION
Integrated PG 2026 notification released.?
A : YES, DOST 2026

