BIKKI NEWS (MAR. 26) : Abundant fuel reserves in Telangana state. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ మరియు గ్యాస్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటించారు .
Abundant fuel reserves in Telangana state
ఈరోజు ఇతర మంత్రులు మరియు ఉన్నతాధికారులతో కలిసి నేడు రాష్ట్రంలో ఇంధన సరఫరా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు.
ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు కథనాలను నమ్మి వినియోగదారులు ఆందోళన చెందవద్దని, అవసరానికి మించి ఇంధనాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
ప్రతి వినియోగదారునికి పెట్రోల్, గ్యాస్ అందేలా చూడాలని అధికారులను, ఏజెన్సీలను ఆదేశించారు. నిల్వలను బ్లాక్ మార్కెట్ చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. పెట్రోల్, గ్యాస్ ఏజెన్సీలకు ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని చెప్పారు.
రాబోయో మూడు నెలలకు సరిపడా ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని మంత్రి తెలిపారు. కమర్షియల్ గ్యాస్ సరఫరాలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నయాని తెలిపారు.
జనం ఒక్కసారిగా పెట్రోల్, డీజిల్ కొరకు జాగ్రత్త పడుతుండడంతో 25% మేర డిమాండ్ పెరిగిందని మంత్రి తెలిపారు.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
