BIKKI NEWS (MAR. 26) : Abundant fuel reserves in Telangana state. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ మరియు గ్యాస్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటించారు .
Abundant fuel reserves in Telangana state
ఈరోజు ఇతర మంత్రులు మరియు ఉన్నతాధికారులతో కలిసి నేడు రాష్ట్రంలో ఇంధన సరఫరా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు.
ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు కథనాలను నమ్మి వినియోగదారులు ఆందోళన చెందవద్దని, అవసరానికి మించి ఇంధనాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
ప్రతి వినియోగదారునికి పెట్రోల్, గ్యాస్ అందేలా చూడాలని అధికారులను, ఏజెన్సీలను ఆదేశించారు. నిల్వలను బ్లాక్ మార్కెట్ చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. పెట్రోల్, గ్యాస్ ఏజెన్సీలకు ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని చెప్పారు.
రాబోయో మూడు నెలలకు సరిపడా ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని మంత్రి తెలిపారు. కమర్షియల్ గ్యాస్ సరఫరాలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నయాని తెలిపారు.
జనం ఒక్కసారిగా పెట్రోల్, డీజిల్ కొరకు జాగ్రత్త పడుతుండడంతో 25% మేర డిమాండ్ పెరిగిందని మంత్రి తెలిపారు.
- Nizamabad DIET guest faculty jobs notification 2026 – డైట్ లెక్చరర్ జాబ్స్
- TGPSC DEO Exam 2026 report – డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పరీక్ష తొలిరోజు ప్రశాంతం
- AP Contract Junior Lecturers Regularisation 2026 – కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం చర్యలు
- UAE jobs enrollment in jagtial 2026 – జగిత్యాల జిల్లా నిరుద్యోగులకు మంచి అవకాశం
- TOMCOM UAE Jobs 2026 – తెలంగాణ ప్రభుత్వ ద్వారా విదేశాల్లో ఉద్యోగాలు

