BIKKI NEWS (MAR. 12) : Telangana inter exams results will release upto April 10. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026 సంబంధించి ఫలితాలను ఏప్రిల్ 10 లోపల విడుదల చేయడానికి తీవ్రంగా బోర్డు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
Telangana inter exams results will release upto April 10
వీలైతే ఎప్రిల్ 5 వ తేదీ లోపు ఫలితాలు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 20 స్పాట్ వాల్యూషన్ క్యాంపు లను ఏర్పాటు చేశారు.
స్పాట్ వాల్యూషన్ క్యాంపు లను సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు.
జీరో ఎర్రర్ వాల్యూషన్ లక్ష్యంగా స్పాట్ వాల్యూషన్ క్యాంపు లను నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నారు.
విద్యార్థులు నీట్, ఎఫ్‌సెట్, జేఈఈ, క్లాట్ వంటి ప్రవేశ పరీక్షల కొరకు సిద్దమవుతున్న విద్యార్థులకు తగినంత సమయం ఉండేలా పరీక్షలను కొంచెం ముందుగానే ప్రారంభించారు. రేపటితో ప్రధాన పరీక్షలు పూర్తి కానున్నాయి.

