BIKKI NEWS (MAR. 08) : INDIA WON ICC T20 WORLD CUP 2026. ఐసీసీ t20 వరల్డ్ కప్ 2026 విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్ లో న్యూజిలాండ్ జట్టును చిత్తుచిత్తుగా ఓడించి ప్రపంచ విజేతగా నిలిచింది.
INDIA WON ICC T20 WORLD CUP 2026
వరుసగా రెండోసారి టి20 వరల్డ్ కప్ గెలుచుకున్న జట్టు మొత్తంగా మూడోసారి వరల్డ్ కప్ గెలుచుకొని అత్యధిక టి20 వరల్డ్ కప్పులు గెలుచుకున్న జట్టుగా నిలిచింది.
256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టును వరుసగా వికెట్లు తీయడంతో వార్ వన్ సైడ్ గా మారింది. ఏ సమయంలోనూ కివీస్ జట్టు గెలుపు ఆశలు పెట్టుకోలేదు.
కివీస్ బ్యాటింగ్ లో ఓపెనర్ సెపర్ట్ 52 పరుగులు, కెప్టెన్ శాంట్నర్ 43 మాత్రమే రాణించారు. మిగతా బ్యాట్స్మెన్ ఒత్తిడికి గురై ఘోరంగా విఫలమయ్యారు.
భారత బౌలర్లలో బుమ్రా 4, వికెట్లు, అక్షర్ పటేల్ 3 వికెట్లు, హార్దిక్ పాండ్యా ఒక్క వికెట్, వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ తీశారు.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా జస్ప్రిత్ బుమ్రా, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా సంజూ శాంసన్ నిలిచారు
Team India innings
అంతకు ముందు భారత జట్టు ఆకాశమే హద్దుగా చెలరేగి భారీ స్కోరును సాధించింది.
16 ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి ఉండకపోతే ఇంకా భారీ స్టోర్ వచ్చే అవకాశం ఉండేది.
సంజు శాంసన్ తన ఫాం కొనసాగించి 46 బంతుల్లో 5 ఫోర్స్ , 8 సిక్స్ లతో 89 పరుగులు సాధించాడు.
కీలక సమయంలో ఫామ్ లోకి వచ్చిన అభిషేక్ శర్మ 18 బంతుల్లో అర్ధ సెంచరీ (51) తో భారీ స్కోరుకు బాటలు వేశాడు.
వన్ డౌన్ లో వచ్చిన ఇషాన్ కిషన్ 25 బంతుల్లో 54 పరుగులు సాధించి ఔటయ్యాడు.
జేమ్స్ నిసామ్ వేసిన 16 ఓవర్లో భారత్ 3 వికెట్లు కోల్పోయింది. దీంతో రిథమ్ కోల్పోయింది. శాంసన్, కిషన్ తో పాటు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ డకౌట్ గా ఈ ఓవర్ లో వెనుదిరిగాడు.
మొత్తం 20 ఓవర్ లలో టీమిండియా 235 పరుగులు సాధించి, కీలక ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.
భారత్ బౌలింగ్ దళం కొంచెం జాగ్రత్తగా బౌలింగ్ వేస్తే మూడో టీ ట్వంటీ వరల్డ్ కప్ భారత్ సొంతం కానుంది.
స్కోర్ వివరాలు
ఇండియా : 255/5
న్యూజిలాండ్ : 159/10
ICC T20 WORLD CUP 2026 WINNER.?
A : India
ICC T20 WORLD CUP 2026 PLAYER OF THE MATCH.?
A : Jasprit BUMHRA
ICC T20 WORLD CUP 2026 PLAYER OF THE SERIES.?
A : Sanjau Samson
- Today Gold Rate June 21st 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Today Gold Rate June 20th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Standard GK bits in Telugu 152 – జనరల్ నాలెడ్జ్ బిట్స్
- Free bus journey – నీట్ విద్యార్థులకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం
- Young India Students kit – విద్యా వికాసమే ప్రభుత్వ లక్ష్యం – సీఎం రేవంత్ రెడ్డి

