BIKKI NEWS (FEB. 28) : What is raman effect explanation in Telugu. ద్రవాలపై పడిన కాంతి కిరణాలు ఎలా పరిక్షేపం చెందుతాయో (చెదురుతాయో) తెలిపే పరిశోధన ఫలితాన్నే రామన్ ఎఫెక్ట్ అంటారు.[1] అంతేకాని సముద్రపు నీటిపై సూర్యకాంతి పడినప్పుడు ఆ కాంతి లోని నీలం రంగు ఎక్కువగా పరిక్షేపం (scattering) చెంది (చెదిరి) మన కంటికి చేరడం వల్లనే సముద్రం నీలంగా కనిపిస్తుందన్న దృగ్విషయం రామన్ ఎఫెక్ట్ కాదు. కాని సముద్రపు నీలి రంగుకీ రామన్ ప్రభావానికి బొత్తిగా సంబంధం లేకపోనూ లేదు. ఇది లోతుగా తరచి చూడవలసిన అంశం. (national science day)
What is Raman effect explanation in Telugu.
ప్రఖ్యాత భారతీయ భౌతిక శాస్త్రవేత్త సర్ సి.వి. రామన్ సిద్ధాంతీకరించిన రామన్ ప్రభావం అంటే ఏమిటో అర్థం చెసుకోవడం అంత తేలిక కాదు; శ్రమ పడితే కాని అర్థం కాదు.
నీరు రంగు, రుచి, వాసన లేని పదార్థం అని పాఠశాలలో చెబుతారు; ఒక గాజు కుప్పెలో పోసిన నీరు రంగు లేనట్లే కనిపిస్తుంది. కాని లోతుగా ఉన్న జలాశయాలలోను, సముద్రంలోను నీరు నీలంగా కనిపిస్తుంది. ఇలా కనిపించడానికి కారణం నీటికి ఉన్న సహజమైన లేత నీలి రంగే. అనగా తెల్లటి సూర్య రస్మి నీటి మీద పడ్డప్పుడు ఆ సూర్య కిరణాలలోని ఎరుపు రంగుని నీరు పీల్చుకుని, మిగిలిన నీలి రంగుని బయటకి వెలిగక్కుతుంది. దీనినే చెదరడం లేదా పరిక్షేపం చెందడం అంటారు.
కాని దూరం నుండి సముద్రాన్ని చూస్తే అది నీటికి ఉన్న సహజమైన లేత నీలి రంగులా కాకుండా ముదురు నీలం రంగులో కనిపిస్తుంది. దీనికి కారణం మనకి కనిపించే నీలి రంగులో కొంత సహజమైన లేత నీలి అయితే మరి కొంత ఆకాశపు నీలి రంగు నీటిలో పరావర్తనం చెంది కనబడడమే. అందుకనే సముద్రం ఆకాశం కంటె ఎక్కువ నీలంగా కనిపిస్తుంది. సముద్రం ఎక్కువ నీలంగా కనిపించడానికి ఇంకా ఇతర కారణాలు ఉన్నాయి. మూడొంతులు రామన్ పడవలో ప్రయాణం చేస్తూన్నప్పుడు ఈ మిగిలిన కారణాలు ఏమై ఉంటాయా అని ఆలోచించి ఉండవచ్చు. ఆ ఆలోచనా స్రవంతి చివరికి రామన్ ప్రభావానికి దారి చూపించి ఉండవచ్చు.
ఉపయోగాలు
ఒక పదార్థంలో ఉన్న అణువుల కంపనాల గురించి సమాచారం చెబుతుంది కనుక రామన్ ప్రభావం ఉపయోగించి ఆ పదార్థంలో ఉన్న అణువుల నిర్మాణ శిల్పం తెలుసుకోవచ్చు.
రామన్ ఎఫెక్ట్ ద్వారా రసాయనిక పదార్థాలలో అణు, బణు నిర్మాణాల పరిశీలన చెయ్యడం సుసాధ్యం అయింది.
పరిశ్రమల్లో కృత్రిమ రసాయనిక సమ్మేళనాల పరిశీలనకు
వైద్య రంగంలో అవసరమయ్యే మందుల విశ్లేషణకు
- contract jobs in KVS Siddipet – కేంద్రీయ విద్యాలయ సిద్దిపేటలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు
- Annual grade increments – 2023 బ్యాచ్ డీఎల్స్ కు ఇంక్రిమెంట్ లు విడుదల చేయండి – హైకోర్టు
- University of Hyderabad jobs – హైదరాబాద్ యూనివర్సిటీలో 37 ఫ్యాకల్టీ పోస్టులు
- Today Gold Rate September 25th 2026 – బంగారం ధర
- TG cabinet meeting – అక్టోబర్ 1న తెలంగాణ మంత్రివర్గ సమావేశం

